పేరాడ, దువ్వాడ… కింజారపు నాయుళ్ళని ఎదుర్కోగలరా?

Perada-TILAK

వైసీపి గురువారం రాత్రి విడుదల చేసిన 3వ జాబితాలో పేరాడ తిలక్‌ను శ్రీకాకుళం నుంచి లోక్‌సభకు, దువ్వాడ శ్రీనివాస్‌ని టెక్కలి నుంచి శాసనసభకు అభ్యర్ధులుగా ఖరారు చేసింది.

ADVERTISEMENT

గత ఎన్నికలలో పేరాడ తిలక్ టెక్కలి నుంచి శాసనసభకు పోటీ చేసి టిడిపి అభ్యర్ధి కింజారపు అచ్చన్నాయుడు చేతిలో 8,545 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదే విదంగా దువ్వాడ శ్రీను గత ఎన్నికలలో శ్రీకాకుళం నుంచి లోక్‌సభకు పోటీ చేసి కింజారపు రామ్మోహన్ నాయుడు చేతిలో 6,653 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

కనుక జగన్‌ ఈసారి వీరిద్దరి స్థానాలను అటూ ఇటూ మార్చి మళ్ళీ ఇద్దరినీ బరిలో దించుతున్నారు. వారి స్థానాలు, మారినప్పటికీ వారి ప్రత్యర్ధులు మాత్రం మళ్ళీ కింజారపు నేతలే ఉంటారు. కాకపోతే అచ్చంనాయుడికి బదులు రామ్మోహన్ నాయుడిని, అలాగే రామ్మోహన్ నాయుడుకి బదులు అచ్చన్నయుడిని వారు ఎదుర్కోవలసి ఉంటుంది అంతే!

శ్రీకాకుళం జిల్లాలో వెలమ, కాళింగ సామాజిక వర్గాల జనాభా ఎక్కువగా ఉంది. టిడిపికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, వైసీపి అభ్యర్ధులుగా పోటీ చేయబోతున్న పేరాడ తిలక్, దువ్వాడ శ్రీను ఇద్దరూ కూడా కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు.

అయితే టిడిపికి చెందిన కింజారపు కుటుంబానికి మొదటి నుంచి శ్రీకాకుళం జిల్లాపై మంచి పట్టు ఉంది. గత ఎన్నికలలో వైసీపి ప్రభంభజనంలో వారిరువురూ గెలిచినప్పుడే ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఈసారి ఎన్నికలలో వైసీపికి ఎదురుగాలి తప్పదని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కనుక పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనులను స్థానాలు మార్చినంత మాత్రన్న కింజారపు నేతలను ఓడించగలరనుకోలేము.

ADVERTISEMENT
Latest Stories