నారా లోకేష్‌ని చూసి వైసీపీ ఎందుకు ఆందోళన?

YSRCP Targets Nara Lokesh Over DSC Teacher Recruitment

సీజేపీ ఆందోళనలతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వైసీపీకి నూతనోత్సాహం కలిగించినట్లే ఉంది. ఆ రోజు నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా కోసం పగటి కలలు కంటోంది.

అయితే ఈ డిమాండ్‌తో ఒకప్పుడు తామే స్వయంగా నానా రకాలుగా అవహేళన చేసిన నారా లోకేష్‌, ఇప్పుడు అత్యంత శక్తివంతుడైన రాజకీయ నాయకుడని వైసీపీ ఒప్పుకున్నట్లే ఉంది.

ADVERTISEMENT

నాడు ఆవిధంగా నారా లోకేష్‌ని రాజకీయాలలో నుంచి తప్పించాలనుకుంది సాధ్యపడలేదు. మళ్ళీ ఇప్పుడు ఈవిధంగా ప్రయత్నిస్తున్నట్లుంది.

సిఎం చంద్రబాబు నాయుడు వయసు పెరుగుతోంది కనుక ఏదో రోజు ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారు. అప్పుడు ఇక ఏపీలో జగన్‌కు పోటీ ఎవరూ ఉండరని అనుకొని ఉండవచ్చు.

కానీ తాము స్వయంగా సాన పట్టిన నారా లోకేష్‌, ఇప్పుడు జగన్‌కి పోటీగా తయారవుతారనే భయం, ఆందోళనే ఈ నకిలీ ఆందోళనలకు అసలు కారణంగా కనిపిస్తున్నాయి.

ఇప్పుడు చర్చ జగన్‌-నారా లోకేష్‌ మద్య పోటీ గురించి కాదు. ఈ నకిలీ ఉద్యమాలతో కూటమి ప్రభుత్వాన్ని బలహీనపరిచి దెబ్బ తీయాలనే వైసీపీ ఆరాటం. ఆ ఆరాటంలో పేర్ని నాని వంటి సీనియర్ నేత ఉపాధ్యాయుల గురించి చులకనగా మాట్లాడిన మాటలు.

“నేను ఉపాధ్యాయులందరూ దొంగలని అనడం లేదు. కానీ డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఆ 16,000 మంది గుంపులో చదువు సంధ్య లేనివాళ్ళు, దొంగ సర్టిఫికేట్స్‌తో వచ్చినవాళ్ళు, కనీస అర్హత లేకుండా వచ్చినవాళ్ళు ఉన్నారు.

వారందరినీ నారా లోకేష్‌ ఈ ఉద్యోగాలలోకి జొప్పించారు. కనుక ఈ 16,000 టీచర్ల గుంపులో దొంగలున్నారని మేము చెప్తున్నాం. ఇలాంటి అక్రమాలు జరిగితే ఈ ఉద్యోగాల కోసమే ఏళ్ళ తరబడి కష్టపడిన అభ్యర్ధులకు తీరని నష్టం కలుగుతుంది కదా? అందుకే మేము ఈ ఆందోళనలు చేస్తున్నాము,” అని పేర్ని నాని అన్నారు.

ఓ పక్క డీఎస్సీ ప్రక్రియలో నోటిఫికేషన్‌ మొదలు పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ వరకు ప్రతీ దశని ఆన్‌లైన్‌లో పెట్టి చాలా పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వం చెపుతుంటే, చదువు సంధ్య లేనివాళ్ళు, కనీస విద్యార్హతలు లేనివాళ్ళకి ఈ ఉద్యోగాలు లభించాయని పేర్ని నాని వాదిస్తున్నారు.

ఎక్కడో ఒకటీ అరా ఇలాంటి పొరపాటు జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వైసీపీ ఆరోపిస్తున్నట్లు వందలు లేదా వేలమంది అనర్హులను ఇలాంటి ఉద్యోగాలలో తీసుకోవడం సాధ్యమేనా? తీసుకుంటే రేపు కేసులు పది వారి ఉద్యోగాలు ఊడితే ప్రభుత్వానికే అప్రదిష్ట అవుతుంది కదా?

పైగా ఇలాంటి కుంభకోణం చేస్తే నారా లోకేష్‌తో సహా ఇతర మంత్రులు, విద్యాశాఖలో అధికారులు కూడా కేసులలో కూడా చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కదా?

ఉజ్వల భవిష్యత్‌ ఉన్న మంత్రి నారా లోకేష్‌ ఇలాంటి పొరపాటు చేసి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటారంటే ఎవరైనా నమ్ముతారా?

కనుక వైసీపీ పగటి కలలు కంటూ చీకటిలో బాణాలు వేస్తోందనిపిస్తోంది. ఎందుకంటే నారా లోకేష్‌ విషయంలో దాని భయాలు, ఆందోళన గురించి ముందే చెప్పుకున్నాం కదా?

ADVERTISEMENT
Latest Stories