మహిళలకు వైసీపీకి గత జన్మ బంధాలు వెండాడుతున్నాయా అనేలా ఆపార్టీ పుట్టుకకు, ఎదుగుదలకు, పతనానికి కూడా మహిళలే కారణమవుతున్నారు. సోనియా గాంధీ మీద పంతంతో పార్టీని స్థాపించిన జగన్, చెల్లి షర్మిల పాదయాత్రతో, తల్లి విజయమ్మ సానుభూతి పలుకులతో పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చారు.
అధికారం లేనప్పుడు ఆడవారిని అడ్డుపెట్టుకుని రాజకీయం నడిపిన జగన్ అదే అధికారం చేతికి రాగానే ఆడవారి మీద రాజకీయం చేస్తూ అధికారం నెట్టుకెళ్ళి ఒక్కో మెట్టు పతనమవుతూ వచ్చారు. చివరికి తల్లిని అవమానిస్తూ చెల్లళ్ళను దూరం పెడుతూ ఇంటి ఆడపడుచుల కన్నీటికి కారణమయ్యి ఒక స్థాయి కిందకు పడ్డారు.
Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్ విశాఖపట్నమే!
అలాగే గత ఐదేళ్ల తన రాజకీయ చరిత్ర తిరగేసినా జగన్ రాజకీయమంతా మహిళా కార్డు చుట్టే జరిగింది. అది నారా చంద్రబాబు సతీమణి విషయం కావచ్చు, కొణిదల పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం పై కావచ్చు ఎటు చూసినా ప్రత్యర్థి పార్టీ నేతల కుటుంబంలోని మహిళలే టార్గెట్ గా జగన్ రాజకీయం పేరుతో రాక్షసానందం పొంది మరో మెట్టు చేజార్చుకున్నారు.
ఇక వైసీపీ పార్టీ తరుపున తమ గళం వినిపించడానికి రంగంలోకి దిగిన వైసీపీ మహిళ నేతలు కూడా పార్టీ బలోపేతానికి కాకుండా పార్టీ పతనానికి కారణమయ్యారు. అందులో మరి ముఖ్యంగా నగరి రోజా, గత ఐదేళ్లుగా ఈమెడ గారు పదవి కోసం వేసిన వెర్రి వేషాలు, పదవి అడ్డుపెట్టుకుని చేసిన వికృత చేష్టలతో వైసీపీ పార్టీ ప్రజలలో పలుచనయ్యింది.
Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!
ఇక జగనన్నా…జగనన్నా అంటూ వైసీపీ కుల దేవతగా అవతరించిన శ్రీరెడ్డి ఆడజాతికే అవమానం అన్నట్టుగా రెచ్చిపోయింది. ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ అండ చూసుకుని కనీసం తానూ ఒక మహిళను అనే సృహ కూడా లేకుండా సంస్కారం మరిచి చేతితో రాయలేని భాషతో, చెవులతో వినలేని బూతులు తిడుతూ, నోటితో చెప్పలేని పదాలు వాడుతూ మదమెక్కిన ఆంబోతు మాదిరి బరితెగించింది.
ఒక పార్టీ అధినేతగా అటువంటి వారిని అదుపు చెయ్యాల్సిన జగన్, ఒక ముఖ్యమంత్రిగా ప్రత్యర్థి పార్టీల నేతలను కట్టడి చేసారు. కష్టాలలో ఉన్న వైసీపీని తమ మద్దతుతో షర్మిల, విజయలక్ష్మి నిలబెడితే, 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీని తమ చర్యలతో రోజా, శ్రీరెడ్డి 11 కి తెచ్చి వైసీపీ ని పాతాళానికి నెట్టారు.
Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్ విధ్వంసానికి…
2019 వైసీపీ విజయానికి షర్మిల మూల స్తంభం గా నిలబడితే 2024 వైసీపీ పతనానికి శ్రీరెడ్డి, రోజా మూలాధారమయ్యారు. షర్మిల తన పాదయాత్రతో అన్నను ముఖ్యమంత్రి ని చేస్తే వీరిద్దరూ తమ నోటి దూలతో జగన్ ను ప్రతిపక్ష నేతగా కూడా నిలబడనివ్వలేదు. కనీసం ఇప్పటికైనా జగన్ తానూ చేసిన తప్పేమిటో తెలుసుకోకుండా ఇంకా అటువంటి మహిళలకే పార్టీలో స్థానం కల్పిస్తూ మరోసారి చర్చనీయాంశం అయ్యారు.
దువ్వాడ మాదిరిగా చెలామణి అవుతు, వైసీపీ మహిళా నేతగా తిరుగుతున్న మాధురి ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేసారు. ఇక అక్కడితో ఆగకుండా ఆమె మీడియా ముందుకొచ్చి దువ్వాడ శ్రీనివాస్ కు మద్దతుగా వైసీపీ పార్టీ తరుపున తన గళం వినిపించి వైసీపీ బ్రాండ్ వాల్యూ ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఈ మాధురి కూడా రోజా, శ్రీరెడ్డి తరహా హావభావాలను వ్యక్తపరుస్తూ ప్రత్యర్థుల మీద రాజకీయ విమర్శలకు బదులు వ్యక్తిగత విమర్శలతో తెగబడ్డారు. కనీసం ఇప్పటికైనా జగన్ పార్టీ తరుపున ఇటువంటి మహిళా నేతలను ప్రోత్సహించకుండా అదుపు చేయాల్సి ఉంటుంది. లేకుంటే “మహిళలందు వైసీపీ మహిళలు వేరయా” అంటూ ప్రజల నుండి ఇంకాస్త వ్యతిరేకతను వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు వైసీపీకి వచ్చిన సీట్లను వదిలి ఓట్ల శాతం గురించి చెప్పుకుంటూ జబ్బలు చరుచుకుంటున్న వైసీపీ నేతలు ఇటువంటి వారి చేతిలో పార్టీ బాధ్యతలు పెడితే ఇక ఆ ఓట్ల శాతాన్ని కూడా చెప్పుకోలేక రాజకీయాలకు ముఖం చాటేయాల్సి ఉంటుంది. అసలు ఇటువంటి వారంతా వైసీపీ గూటికే చేరుతారా.? లేక వైసీపీ తీర్థం పుచ్చుకున్నాకా ఇలా మారతారా.? అనేది ఏపీ రాజకీయాలను పరిశీలిస్తున్న వారి అభిప్రాయం.