ఛలో దొనకొండ… వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉత్సాహం

YSR-Congress-Showing-PK-Withdrawal-Symptomsఈ సారి ఎన్నికలలో ఎలాగైనా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమాగా ఉన్నారు ఆ పార్టీ నాయకులు. దీనితో జగన్ అమరావతి నుండి రాజధానిని తరలించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులు నాయకులు ఒంగోలు జిల్లాలో దొనకొండ ప్రాంతంపై దృష్టి సారించారు. ఇక్కడ భూముల కొనుగోళ్లుకు ఉత్సాహం చూపుతున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంత వాసులతో పాటు విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాల నుంచి కూడా భూములను పరిశీలించి కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో అమరావతి విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించలేదు. దీనితో రాజధాని మార్పు ఖాయమని వారు అంటున్నారు. గతంలో 2014 ఎన్నికల సందర్భంగా జగన్ అధికారంలోకి వస్తే దొనకొండ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. కడప జిల్లాకు చెందిన వారు, ప్రత్యేకించి ఆ పార్టీలో కొందరు ముఖ్యనాయకులు అప్పట్లో ఆప్రాంతంలో ముందస్తుగానే భూములు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు గెలిచి రాజధాని గుంటూరు జిల్లాకు తరలించడంతో అక్కడ పెట్టుబడులు పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు భారీగా నష్టపోయారు.

ADVERTISEMENT

అయితే గతంలో జరిగిన నష్టంతో రేట్లు అమాంతం పెంచడం లేదు. పోలింగ్ తరువాత భూముల క్రయవిక్రయాల్లో క్రమేపీ పెరుగుతున్నాయని తెలుస్తుంది. ఇప్పటివరకూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే పెట్టుబడి పెట్టడం విశేషం. మరి ఈ సరైన వారు పెట్టిన పెట్టుబడి లాభాలను తెచ్చిపెడుతుందేమో చూడాలి. మరోవైపు జగన్ గెలిస్తే ఈ సారి అమరావతి నుండి కాకుండా ఇడుపులపాయలో ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం వస్తుంది.ఇలా రాజధాని మార్పు ఖాయమనే సంకేతాలు పంపుతారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories