ఒకప్పుడు జగన్ వద్దకు వెళ్లి, అతని వ్యవహార శైలి సరిగా లేదని, అతనిలో మరో అపరిచితుడు ఉన్నాడని బహిరంగంగా చెప్పిన రఘురామకృష్ణంరాజు, మళ్ళీ గత ఎన్నికల సందర్భంలో జగన్ చెంతన నిలిచిన విషయం తెలిసిందే. వైసీపీ తరపున ఎంపీగా విజయం సాధించిన తర్వాత జరిగిన పరిణామాలు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా అందరికీ సుపరిచితమే.
ఒకసారి నచ్చక జగన్ తో పోసకక వీడిపోయిన ఆర్ఆర్ఆర్ మళ్ళీ చేరడానికి గల కారణమేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పాదయాత్రలో జగన్ పూర్తిగా మారిపోయాడని, ఎలా ఉన్నా చిన్న పిల్లలను దగ్గరకు తీసుకుంటున్నాడని, ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాయ మాటలు నమ్మి మళ్ళీ చేరానని చెప్పిన రాజు గారు, దానిని “వేశ్యా గృహంలో అమ్మేసినట్టు నన్ను తీసుకెళ్లి ఇక్కడ పడేశారని” అభివర్ణించారు.
‘కాలు జారాం కడుపయ్యింది’ అన్న మాటకు ‘కడుపు అవ్వలేదు, కాళ్ళు వాచాయి’ అంటూ పంచ్ వేశారు ఏబీఎన్ రాధాకృష్ణ. సినిమాలలో కొట్టుడు సన్నివేశాలకే తనకు బాధ వేస్తుందని, అలాంటిది తానే కొట్టించుకుంటానని ఊహించలేదని, తన జీవితంలో మొదటి దెబ్బే పోలీస్ దెబ్బ అని, ఆ అధికారి తనకు తెలిసిన వాడేనని, అతను ఫోన్ లో అందరి కంటే పై వాడికి చూపెట్టి ఆనందం పొందారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీతో అప్పాయింట్మెంట్ కావాలంటే మా ముఖ్యమంత్రి కోరినన్ని సార్లు నేను కోరక్కర్లేదని ఎద్దేవా చేసిన రాజు గారు, తనను అసెంబ్లీలో ఒకరు నన్ను ‘లు…’ అన్నారని, దానికి ఇతని ఫీలింగ్స్ చూస్తే మురిసిపోయారని, అక్కడికి ఆగలేక ‘మనసు దోచావ్’ అన్నారని కట్ చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఆదివారం నాడు దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది.



