
విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్న హీరో అశ్విన్ బాబు ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నారు. ‘వచ్చినవాడు గౌతమ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ మెడికో థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది. మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను టి. గణపతి రెడ్డి అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభించగా, తాజాగా విడుదలైన టీజర్ మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. “ధర్మం దారి తప్పినప్పుడు… ఏ అవతారం రానప్పుడు… వచ్చినవాడు గౌతమ్” అంటూ మనోజ్ మంచు పవర్‌ఫుల్ డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది.
Also Read – WAR 2: NTR to Steal the Show from Hrithik Roshan?
అశ్విన్ బాబు పాత్రలో కనిపించే గౌతమ్ క్యారెక్టర్ ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ ఇంటెన్సిటీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. మంచు మనోజ్ వాయిస్ టీజర్ ఇంటెన్స్ ని మరింత ఎలివేట్ చేసింది.
దర్శకుడు మామిడాల ఎం.ఆర్. కృష్ణ వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. గౌర హరి సంగీతం టీజర్ ని ఎలివేట్ చేయగా, ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీజర్ మొత్తం సినిమాకి ఉన్న టెక్నికల్ స్టాండర్డ్స్‌ను తెలియజేస్తూ, ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది.
Also Read – #M9INSIDE: Venkatesh Hurt With Trivikram’s Behavior
మొత్తానికి, ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ యాక్షన్, ఎమోషన్, థ్రిల్ బ్లెండ్ తో సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. త్వరలోనే సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.