మోడీ ప్రస్థానానికి పుష్కరకాలం…

narendra-modi-record as Prime minister

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రస్థానం నేటికీ ఒక పుష్కర కాలం పూర్తి చేసుకుంది. గతంలో భారతదేశ తొలి ప్రధానిగా ఎన్నికైన పండిట్ జవహర్ లాల్ నెహ్రు పేరిట దశాబ్దాలుగా పదిలంగా ఉన్న ఈ రికార్డు ను నేడు మోడీ తన హవా తో బద్దలుకొట్టారు.

బ్రిటిష్ పాలన తరువాత భారతదేశ సామజిక, రాజకీయ దశను, దిశను నిర్దేశించిన నేతగా నెహ్రు పేరు చిరస్థాయిగా ఉన్నట్టే భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన రాజకీయ, సామజిక శక్తిగా నిలబెట్టిన క్రెడిట్ మోడీ ఖాతాలో పడింది.

ADVERTISEMENT

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రధానిగా నేటికీ నరేంద్ర మోడీ 12 సంవత్సరాల 14 రోజులు పూర్తి చేసుకున్నారు. దీనితో భారతదేశ రాజకీయ చరిత్రలో మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో నెహ్రు పేరిట ఉన్న ఈ రికార్డు ని మోడీ నేటితో బద్దలుకొట్టడంతో ఎన్డీయే కూటమి నేతలు మోడీకి శుభాకాంక్షలు తెలియయచేసారు.

కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా పుట్టుకొచ్చిన బీజేపీ ని దేశంలో మూడోసారి అధికారంలోకి తెచ్చిన ఘనత మోడీ కే దక్కుతుంది. మోడీ హావలో కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. గత దశాబ్దం కాలం నుంచి దేశంలో మోడీ మార్క్ పాలన, దాని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దేశ ప్రధానిగా మోడీ నోట్ల రద్దు వంటి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే కరోనా వంటి భయంకర వైరస్ దాటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు కాకుండా నిలబెట్టారు. ఇక పాక్ ఉగ్రవాద కోరలలో చిక్కుకున్న కాశ్మీర్ వంటి ఉద్రిక్తత ప్రదేశాలలో ఆర్టికల్ 370 ని రద్దు చేసి కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులను నెలకొల్పారు.

అలాగే భారత్ కు పక్కలో బల్లెం లా మారిన పాకిస్తాన్ కు భారదేశం సైనిక శక్తి బలమెంతో, ఆ బలం తలచుకుంటే దాని తాలూకా విధ్వంశం ఎలా ఉంటుంది, భారత సేన ఓర్పు, సహనం అనే దేశ సరిహద్దులు దాటితే దాని తాలూకా ఫలితం ఎలా ఉంటుందో అనేదానికి పాకిస్తాన్ లో భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ ఒక చక్కటి ఉదాహరణ.

ఇక తాజాగా పాక్ ఉగ్రవాదులు జరిపిన పెహాల్గమ్ ఉగ్రదాడుల తరువాత భారతసేన నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తో భారత వాయుసేన పవర్ ఏంటిది అనేది పాక్ తో పాటుగా ప్రపంచ దేశాలు తెలుసుకున్నాయి. ఇక మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ అంచలెంచలుగా వృద్ధిలోకి వస్తుంది. దేశ జీడీపీ రేటు క్రమక్రంగా పెరుగుతూ పోతుంది.

మేక్ ఇన్ ఇండియా నినాదం, స్వచ్ఛ భారత్ విధానం మోడీ నాయకత్వ పటిమకు అద్దం పడుతుంది. ఇక మోడీ నాయకత్వలో దేశ రైల్వే వ్యవస్థ లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. వందే భారత్ మొదలుకుని స్టాట్యూ ఆఫ్ యూనిటీ, కొత్త పార్లమెంట్ భవనం,సెంట్రల్ విస్టా,కర్తవ్య పథ్, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

భారతదేశ ప్రధాని గా మోడీ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందారు, గౌరవం దక్కించుకున్నారు. మోడీ నాయకత్వంలో దేశంలో సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందడంతో దేశంలో డిజిటల్ విప్లవం మొదలయ్యింది. అలాగే మోడీ తన మార్క్ పాలనతో దాదాపు దేశం మొత్తం కాషాయ జెండా ను రెపరెపలాడేలా చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories