జగన్ కు తగలనున్న ‘డబుల్ జలక్?’

Jagan poor show at Special Status dharnasవైసీపీ అధినేతకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. గెలిచిన 67 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 17 మంది అధికార పార్టీ తీర్ధం పుచ్చుకుని, జగన్ బలాన్ని 50కు పరిమితం చేయగా, తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారనే వార్తలతో, వైసీపీ అధినేత బలగం 50 సంఖ్య కంటే దిగువకు చేరనుంది. ఇప్పటివరకు పార్టీ మారిన 17 మంది ఎమ్మెల్యేలను విజయవాడ క్యాంపు ఆఫీసుకు రావాలని సిఎం ఆదేశాలు జారీ చేయడంతో వారంతా విజయవాడకు పయనమయ్యారు.

ADVERTISEMENT

17 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారని మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో ఒకరు ముత్తముల అశోక్ రెడ్డి కాగా, మరొకరు పోతుల రామారావుగా తెలుస్తోంది. రాజ్యసభ ఓటింగ్ నేపధ్యంలో పార్టీ మారిన నేతలకు దిశానిర్దేశం చేసేందుకు వారందరినీ పిలిచినట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డి చేత రాజ్యసభ సభ్యత్వానికి ప్రతిష్టాత్మకంగా నామినేషన్ వేయించిన జగన్, మరి పోటీలో విజయం సాధిస్తారో లేదోనన్న అంశం ఆసక్తికరంగా మారింది.

నిజానికి విజయసాయిరెడ్డిని గెలిపించుకోవడానికి 36 ఎమ్మెల్యేల బలం సరిపోతుంది. అయితే చివరి నిముషంలో ‘ట్విస్ట్’లను కూడా అంచనాలు వేస్తున్న జగన్, 40 మంది ఎమ్మెల్యేలకు క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లుగా టాక్. వారందరినీ హాలిడే ట్రిప్ ల పేర్లుతో పర్యాటక ప్రాంతాలకు పంపించినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సంప్రదాయాలు ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వాన్ని పడగొట్టే సమయంలో రాజకీయ నేతలు చేస్తూ ఉంటారు. కానీ, జగన్ రాజ్యసభ సీటుకు కూడా ఈ ఒరవడిని తీసుకువచ్చి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టనున్నారు.

ADVERTISEMENT
Latest Stories