
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఏ స్థాయి లాభలను తెచ్చిపెడుతుందో అలాగే ఫెయిల్యూర్ కూడా అంటే స్థాయి నష్టాలను తీసుకొస్తుంది. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీ లో తానూ ఎదుర్కున్న ఫెయిల్యూర్స్ దాని ఫలితంగా వచ్చిన నష్టాలను బయటపెట్టారు శింగనమల రమేష్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొమరం పులి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఖలేజా సినిమాల నిర్మాత సింగనమల రమేష్ ఆ రెండు సినిమాలతో తనకు వంద కోట్ల మేరకు నష్టం వచ్చిందంటూ తన ఆవేదన వ్యక్తపరిచారు. అలాగే ఆ స్థాయి నష్టాలు వచ్చినప్పటికీ ఇటు పవన్ కానీ అటు మహేష్ కానీ కనీసం సాయం కాదు కదా తనకు ఫోన్ చేసి కూడా అయ్యో పాపం అంటూ పరామర్శించలేదంటూ వాపోయారు రమేష్.
Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?
కొమరం పులి, ఖలేజా సినిమాల సమయంలో ఆరు నెలల నుంచి ఏడాదిలోపే పూర్తయ్యే ప్రొడక్షన్, దాదాపు మూడేళ్ళ సమయం తీసుకోవడంతో కాస్ట్ అఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి, సినిమాలు కూడా ప్రేక్షకుడి అంచనాలు అందుకోలేకపోవడంతో ఆ ఇద్దరి హీరోలతో వంద కోట్లు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.
పవన్ ‘ప్రజారాజ్యం’ పార్టీతో రాజకీయాలలో బిజీగా ఉండడంతో కొమరం పులి ఆలస్యమయ్యిందని, ఇక ఖలేజా ఆలస్యానికి కూడా అనేక కారణాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించిన రమేష్ ఇదంతా కూడా తనతలరాత అంటూ నిట్టూర్చారు.
Also Read – జగన్ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?
అలాగే ఇన్నాళ్లుగా మద్దెల చెరువు సూరి, భాను కిరణ్ తో సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆయన పై కేసులు నమోదయ్యి చట్టపరమైన వివాదంలో చిక్కుకున్నారు. అయితే తాజాగా ఆ కేసుల విషయంలో రమేష్ కు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పుని ప్రకటించడంతో తానూ మరల సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నట్టు ప్రకటించిన రమేష్ .
అయితే పవన్, మహేష్ ల మీద ఆరోపణలతో రమేష్ రీ ఎంట్రీ సినీ ఇండస్ట్రీలో ఏ మేరకు అవకాశాలను తెచ్చిపెడుతుందో చూడాలి మరి.
Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?