2016లో జరిగిన అతి పెద్ద కుంభకోణం!

2016 Notes Ban Was Biggest Scamపదేళ్ళ యూపీఏ పాలన అంతా కుంభకోణాలకు నిలయంగా మారిన నేపధ్యంలో… గత రెండున్నర్ర సంవత్సరాలుగా బిజెపి హయంలో ఎలాంటి కుంభకోణాలు వినపడక ప్రజలకు ఊరటనిచ్చింది. అయితే 2016లో ఓ భారీ కుంభకోణం జరిగింది అంటున్నారు మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం. అదే… నోట్ల రద్దు అంశం! హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ… పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, చిన్న వ్యాపారులు వ్యాపారం జరుగక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు.

దేశంలో వంద శాతం నగదు రహిత లావాదేవీలు తీసుకొస్తామని ప్రధాని చెబుతున్న మాటలు బూటకమని, ఇప్పటికే అభివృద్ధి చెందిన అమెరికా, యూరోప్ సహా ప్రపంచంలోని ఏ దేశంలోనూ వంద శాతం నగదు రహిత లావాదేవీలు అమలు కావడం లేదని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో రోజువారీ లావాదేవీలు నగదుతోనే నిర్వహించుకుంటారని, వారి నుంచి డబ్బులు తీసుకుని, నగదు రహిత లావాదేవీలు అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories