సంగీతం రాళ్లను కరిగిస్తుందంటారు, కానీ అదే సంగీతం ఈ ఏడు ఎన్నో సినిమాలకు జీవం పోసింది. సినిమాలో ఉన్న నరేషన్, రైటింగ్ మరియు నటీ-నటుల ప్రదర్శనను అధిగమించి, కొన్ని సినిమాలు ఏకంగా మ్యూజిక్ తోనే ప్రాచుర్యం పొందాయి. ఈ ఫార్ములా తో ఈ సంవత్సరం ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టెక్కేశాయి.
తొలుత ‘గుంటూరు కారం’ బాక్స్-ఆఫీస్ వద్ద నిరాశపరిచిన, మ్యూజిక్ తో థమన్ మ్యాజిక్ చేసేశారనడంలో సంకోచమే లేదు. ఆ మూవీ లో వచ్చిన మహేష్, శ్రీలీల మాస్ సాంగ్ కుర్చీ మడత పెట్టి యు ట్యూబ్ రికార్డులను మడతపెట్టింది.
Also Read – కాళేశ్వరం సమస్యలు, పరిష్కారాలు.. అన్నీ ఆయనే!
అదే సీజన్లో వచ్చిన ‘హనుమాన్’ కూడా దర్శకుని స్టోరీ, రైటింగ్, నరేషన్ మరియు హీరో ను ఇతిహాసాలతో ఎలివేట్ చేసిన సీన్లలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది, నిజానికి మ్యూజిక్ వల్లే అభిమానులు థియేటర్లో గూస్బంప్స్ ఫీల్ అయ్యారు.
ఇక, మార్చ్ ఆఖరిలో వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ సీక్వెల్ గా అభిమానులను అలరించటం లో ఓ మెట్టు పైనే ఉన్నప్పటికీ, మ్యూజిక్ వలనే ఆ స్థాయి కి వెళ్ళింది అనటం వాస్తవమే. ఆ తరువాత చాలా సినిమాలే విడుదలైనప్పటి, మ్యూజిక్ హైలైట్ నిలిచిన సినిమాలంటూ లేవు. ఇక, ‘కల్కి’ రాకతో సంతోష్ ,సినిమా కు హైలైట్ అయిన క్లైమాక్స్ ను తన మ్యూజిక్ తో విపరీతంగా ఎలివేట్ చేసారు.
Also Read – డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇలా…
మళ్ళీ ‘కమిటీ కుర్రాళ్ళ’ రాకతో ప్రేక్షకులకు మ్యూజిక్ చేసే మ్యాజిక్ తెల్సింది .సినిమా ద్వారా మన చిన్ననాటి జ్ఞాపకాలను స్మృతికి తెచ్చేటువంటి అద్భుతమైన మ్యూజిక్ సినిమా కే హైలైట్ గా నిలిచింది. ఇక, అప్పుడే వచ్చింది నాని-సూర్య ల ‘సరిపోదా శనివారం’! ఈ సంవత్సరానికే బెస్ట్ బ్యాక్-గ్రౌండ్ స్కోర్ అంటే ఆలోచన లేకుండా అందరూ చెప్పే ‘మాట’ ఈ సినిమానే. థియేటర్ లో చూస్తున్న ప్రేక్షుకులకు పూనకాలు తెప్పించేసాడు ‘జెక్స్ బిజోయ్’.
ఇక అప్పుడు వచ్చింది ‘అనిరుధ్ సంగీత తాండవం’. ‘దేవర’ లో కొరటాల దర్శకత్వాన్ని, యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ నటనను సైతం అనిరుధ్ తన సంగీతం తో ఒంటి చేత్తో ఎలివేట్ చేసాడు. సినిమా కే మ్యూజిక్ కు ప్రాణం పోశారు. ఇక రవితేజ ‘మిస్టర్.బచ్చన్’ కూడా ఆల్బమ్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ రొట్ట రొటీన్ కథతో బాక్స్ ఆఫీస్ ముందు తలవంచక తప్పలేదు. ఇక 2024 కే చివరి పెద్ద సినిమాగా వచ్చిన ‘పుష్ప-2 ‘ లో దేవి శ్రీ ప్రసాద్ చేసిన మ్యాజిక్ ఇప్పట్లో మర్చిపోయేది కాదు.
Also Read – ఐశ్వర్య రాజేష్..మరో అంజలి అవుతారా.?
ఫస్ట్ హాఫ్ లో ని కొన్ని సీన్లకు పడే మ్యూజిక్, సెకండ్ హాఫ్ లో జాతర సీక్వెన్స్ మరియు ప్రీ-క్లైమాక్స్ లో ని ‘రప్ప రప్పా’ ఫైట్ కు దేవి కొట్టిన మ్యూజిక్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ఇక, క్లైమాక్స్ లో ని సెంటిమెంటల్ మ్యూజిక్ కూడా అలరించింది. ఇలా ఈ ఏడాది ఎన్నో సినిమాలకు సంగీత దర్శకులు తమ మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పోసి ఆ సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లారు.