ఒక్క ఏరియాలోనే 100 కోట్లు కొల్లగొట్టింది!

AAMIR KHAN dangal CROSSES RS 100 CRORE MARK IN MUMBAIఎన్ని సినిమాలు విడుదలైనా ‘కంటెంట్’ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు ఎలాంటి నీరాజనం పలుకుతారో అన్న దానికి నిదర్శనంగా అమీర్ ఖాన్ “దంగల్” చిత్రం నిలుస్తోంది. ఇప్పటికీ వీకెండ్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మోత మోగుతున్న ఈ సినిమా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం, ఈ సోమవారం నాటి కలెక్షన్స్ తో ఒక్క ముంబై ఏరియాలోనే ఈ సినిమా 100 కోట్లును కొల్లగొట్టి, సరికొత్త రికార్డులను సృష్టించింది.

ADVERTISEMENT

మొత్తంగా ఇండియాలో 371.48 కోట్లు కొల్లగొట్టిందని, గత శుక్రవారం నాడు 1.94 కోట్లు, శనివారం నాడు 4.06 కోట్లు, ఆదివారం నాడు 4.24 కోట్లు, సోమవారం నాడు 1.37 కోట్లు వసూలు చేసిందని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాలుగవ వారం కావస్తున్నా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం గొప్ప విషయమే. కేవలం ‘కంటెంట్’ మాత్రమే ప్రేక్షకులను ధియేటర్లకు రప్పిస్తుందని “దంగల్” ద్వారా నిరూపణ అయ్యిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories