ఆఫ్ఘన్ మ్యాచ్ లో టీమిండియా ట్విస్ట్!

Afganisthan-Vs-india-Matchఆసియా కప్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు షాక్ ఇస్తూ అమోఘమైన విజయాలను నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాక్ ను కూడా దాదాపుగా ఓడించినంత పని చెసింది. అలాంటి ఆఫ్ఘన్ జట్టుతో తలపడిన టీమిండియా జట్టులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు టీమిండియా విజయాలకు వెన్నమూక అయిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లకు విశ్రాంతి ఇచ్చారు.

[m9ad]

ADVERTISEMENT

కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ స్థానంలో ఎవరు ఆ బాధ్యతలను నేరవేరుస్తున్నారో తెలుసా? ఇంకెవరో కాదు, మహేంద్ర సింగ్ ధోని. ఇప్పటివరకు 199 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన ధోని, నేటి మ్యాచ్ తో కలిపి 200ను పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తో ఆసియాలో 200 వన్డే మ్యాచ్ లకు కెప్టెన్సీ చేసిన తొలి క్రికెటర్ గా మహేంద్ర సింగ్ ధోని రికార్డులకెక్కాడు.

మొత్తమ్మీద ధోని కంటే ముందు స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్) 218 మ్యాచ్ లకు, రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 230 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ మ్యాచ్ లో ధోని కెప్టెన్ గా దిగుతారన్న విషయం ఎవరూ అంచనాలు వేయనిది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని, దూకుడైన రీతిలో ఇన్నింగ్స్ ను ఆరంభించింది.

ADVERTISEMENT
Latest Stories