టీమ్ ఇండియా, వెస్టిండీస్ జట్లు తమ మధ్య జరిగే రెండో టెస్టు కోసం హైదరాబాద్‌కు చేరుకున్నాయి. కోహ్లీ తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఈ నేపథ్యంలో కోహ్లీ అన్నపూర్ణ స్టూడియోస్‌కు వెళ్లారు. ఆయనపై అక్కడ ఒక టీవీ కమర్షియల్ చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
[m9ad]
ఈ సందర్భంగా కోహ్లీ, అక్కినేని అఖిల్‌తో కలిసి సరదాగా ముచ్చటిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం నుంచి రెండో టెస్టు ఉప్పల్ స్టేడియంలో ప్రారంభంకానుంది. మరోపక్క విరాట్ భార్య అనుష్క ‘సుయీ ధాగా’ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేకపోవడంతో భర్తతో కలిసి మ్యాచ్‌ను వీక్షించేందుకు హైదరాబాద్‌కు వచ్చారు.
అనుష్క నటించిన ‘జీరో’ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించారు. రెండు టేస్టు మ్యాచ్ల సిరీస్ లో భారత్ ఇప్పటికే మొదటి టెస్టు గెలిచి ఆధిక్యంలో ఉంది. కాగా ఈ టెస్టుకు స్కూల్ పిల్లలను ఉచ్చితంగా స్టేడియంలో చుడనిస్తున్నారు.



