ప్రస్తుతం హీరోల జీవితాలలో అభిమానుల పాత్ర చాలా ఉంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అంటూ అభిమానులు – సెలబ్రిటీల మధ్య అంతరం తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఏఎన్నార్ మూడవ వర్ధంతిని పురస్కరించుకుని ఓ అభిమాని తన క్రియేటివిటీకి పదును పెట్టారు. అందులో భాగంగా అఖిల్ నిశ్చితార్ధ వేడుకకు ఏకంగా అక్కినేని నాగేశ్వరరావు హాజరై ఫోటోకు ఫోజిచ్చారు.
అవును… పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అఖిల్ వేడుకకు ఏఎన్నార్ హాజరయ్యారు. అక్కినేని ఫ్యామిలీ అంతా దిగిన ఫోటోలో ఏఎన్నార్ లేరన్న విషయం గమనించిన అభిమాని, ఏఎన్నార్ లేని లోటును పూడుస్తూ సదరు ఫోటోను ఎడిట్ చేసి, అందులో ఎవర్ గ్రీన్ ఏఎన్నార్ ను చేర్చారు. నిజంగా అక్కినేని అక్కడే ఉన్నట్లుగా కనపడుతున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
సాధారణంగా మెగా, ప్రిన్స్ వర్గాలు ఇలాంటి ఫోటో ఎడిట్ లతో సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తుంటారు. కానీ, ఈ సారి అక్కినేని ఫ్యాన్స్ వంతు వచ్చింది. వీక్షకులందరినీ మెస్మరైజ్ చేసే విధంగా ఉన్న ఈ ఫోటోను చూస్తూ… అక్కినేని ఫ్యాన్స్ కేక పుట్టించారుగా అంటున్నారు నెటిజన్లు. ‘మనం’తో చివరిసారిగా మెస్మరైజ్ చేసిన ఏఎన్నార్ ను తలచుకుంటూ అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.
#M9NewsWin1000 contest every Wednesday – Answer our Question and win Rs 1000 Paytm Gift vouchers pic.twitter.com/0f9fx8dEsN
— M9News (@M9News) January 18, 2017



