శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు…

Allu Aravind Met Sri Tej in Hospital

గత ఏడాది డిసెంబర్ 4 న పుష్ప – 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన అనుకోని సంఘటనతో ఒక కుటుంబంలో పెను విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె బిడ్డ శ్రీ తేజ్ కొనఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందడం అందరి హృదయాలను బాధకు గురిచేసింది.

అయితే అప్పటి నుంచి కిమ్స్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటూ ఆసుపత్రి బెడ్ కే పరిమితమైన శ్రీ తేజ్ కోమాలో నుంచి బయటకు రావడం, ఆయన ఆరోగ్య పరిస్థితి మునుపటి తో పోలిస్తే కాస్త మెరుగు పడడంతో గత వారంలో కిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు.

ADVERTISEMENT

అయితే నేడు అల్లు అరవింద్ శ్రీతేజ్ ను పరామర్శించేందుకు హైద్రాబాద్ లోని ఏషియన్ ట్రాన్స్ కేర్ రీహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లారు. శ్రీతేజ్ ప్రస్తుత ఆరోగ్య స్థితి పై ఆరా తీసిన అరవింద్, బాబుకి అందుతున్న వైద్య సదుపాయాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు.

అలాగే అల్లు అరవింద్ తో పాటుగా బన్నీ వాసు కూడా శ్రీతేజ్ పరామర్శకు వెళ్లారు. అయితే అటు అల్లు కుటుంబం తో పాటుగా శ్రీతేజ్ ఆరోగ్యం పై ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టడంతో శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందుతుంది.

అయినప్పటికీ శ్రీతేజ్ ఇప్పటికి ఎవరిని గుర్తించలేని పరిస్థితులలోనే ఉన్నట్టు బాబు తండ్రి మీడియాకు వెల్లడించారు. అలాగే బాబు ఆరోగ్యం ఎప్పటికి యదా స్థితికి వస్తుందన్న విషయం మీద కూడా వైద్యులు ఇప్పటికి బాబు కుటుంబానికి ఒక స్పష్టత ఇవ్వలేకపోవడం బాధాకరం. త్వరలోనే శ్రీతేజ్ కోలుకుని తన కుటుంబంతో కలిసి జీవించాలని అందరు ఆకాంక్షిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories