
ఒక భారీ విజయం అందుకున్న తరువాత ఆ హీరో నుండి వచ్చే భవిష్యత్ ప్రాజెక్ట్స్ పై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొంటాయి. వాటిని అందుకోవడానికి అటు ఆ హీరో తో పాటుగా ఆ హీరోను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు, ఆ హీరో సినిమాను నిర్మించబోయే నిర్మాత మీద కూడా ఊహకు అందలేనంత స్థాయిలో ఒత్తిడి ఉంటుంది.
ఇది కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా క్రెజీ హీరోగా గుర్తింపు దక్కించుకున్న యష్ విషయంలో స్ఫష్టంగా చూడవచ్చు. ఆ స్థాయి విజయం తరువాత అతడి నుండి రాబోయే సినిమా ఇక ఏ స్థాయిలో ఉంటుందో అంటు ప్రేక్షకులు పెట్టుకునే అంచనాలు, ఇక వారిని ఆ స్థాయిలోనే అలరించి తీరాలంటూ చిత్ర యూనిట్ తీసుకునే ఒత్తిడి తో కెజిఎఫ్ సినిమా వచ్చి రెండు ఏళ్ళు గడుస్తున్నా ఇంకా యష్ నుంచి మరో మూవీ బయటకు రాలేని పరిస్థితి.
Also Read – తెలంగాణలో మొదలైన ‘రిజర్వేషన్ల’ లొల్లి..!
ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ఉండవచ్చు. పాన్ ఇండియా వ్యాప్తంగా రికార్డుల దుమ్ము దులిపిన పుష్ప గాడి రూలింగ్ ఇచ్చిన విజయం అల్లు అర్జున్ కెరీర్ కు ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. ఇక ముందు బన్నీ నుంచి రాబోయే సినిమాలను సహజంగానే పుష్ప సినిమాతో సరిపోలుస్తారు ఆయన అభిమానులు, సాధరణ సినీ ప్రేక్షకుడు.
అందువల్ల బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పుష్పకు మించి ఉండాలి అనే స్థాయిలో బన్నీ అభిమానులు బన్నీ పైన, బన్నీ నెక్స్ట్ మూవీ టీం మీద అనుకోని ఒత్తిడినిపెడతారు. దీన్ని కరెక్టుగా హ్యాండిల్ చేసి అటు తన అభిమానులతో పాటుగా సాధారణ ప్రేక్షకుడిని కూడా మెప్పించగలగాలి. RRR తరువత వచ్చిన దేవర సినిమాతో ఎన్టీఆర్ ఇదేతరహా ఒత్తిడిని ఎదుర్కొని భారీ విజయాన్ని అందుకోగలిగారు. ఇప్పుడు ఆ పరిస్థితిలోకి అల్లు అర్జున్ వచ్చి చేరుకున్నారు.
Also Read – ఐసీయూ లో ఉన్న వైసీపీకి చిరు ఊతమిస్తే…టీడీపీ ఊపిరి తీసింది.!
ఇక చెర్రీ విషయానికి వస్తే RRR తో ప్రపంచ వ్యాప్తంగా మరోమారు టాలీవుడ్ స్టామినాతో పాటుగా తన క్రెజ్ ను పెంచుకున్న రామ్ చరణ్ ఆ తరువాత ఆ ఫీల్ ను కొనసాగించలేకపోయారు. తండ్రి మెగా స్టార్ తో కలిసి గెస్ట్ రోల్ లో ఆచార్య అంటు పలుకరించినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇక గేమ్ ఛేంజర్ అంటు సంక్రాంతి బరిలో దిగినా మెగా అభిమానుల్ని కూడా ఆకట్టుకోలేకపోయింది చెర్రీ GC .
ఒక హిట్ అందుకున్న హీరో తన నెక్స్ట్ మూవీ పై ఎంత ఒత్తిడిని ఎదురుకుంటాడో అలాగే ఒక భారీ డిజాస్టర్ మూటకట్టున్న నటుడు కూడా తన నెక్స్ట్ మూవీ మీద అంతే ఒత్తిడిని తట్టుకుంటాడు అనేది వాస్తవం. అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉంటాయి, సాధరణ ప్రేక్షుడికి అసలు అంచనాలే ఉండవు ఈ పరిస్థితులలో సదరు నటీ నటులు విజయం కోసం తీవ్ర మానసిక ఒత్తిని చవిచూస్తారు.
Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?
ఇప్పుడు పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న బన్నీ, బన్నీ నెక్స్ట్ మూవీ ని డైరెక్ట్ చేయబోతున్న త్రివిక్రమ్ ఒకరకమైన ఒత్తిడిని ఎదుర్కొటుంటే, రెండు డిజాస్టర్స్ ఎదుర్కున్న చెర్రీ, చెర్రీ తో తన తరుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్న బుచ్చి బాబు మరో రకమైన ఒత్తిడిని ఎదురుకుంటూ ఒకే సందిగ్ధ స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో విజయం బరువు మోయడానికి, అపజయం బలహీతను తట్టుకోవడానికి హిట్టే ఆయుధం అనేది సుస్పష్టం.