‘ఎన్టీఆర్’ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ చేసాడా?

allu Arjun immitates ntr in duvvada jaganadhamమెగా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన అల్లు అర్జున్ “దువ్వాడ జగన్నాధమ్” ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను పలకరించింది. కమర్షియల్ హీరోగా చూసి చూసి ఉన్న బన్నీని బ్రాహ్మణుడిగా సరికొత్త గెటప్ లో చూడడంతో, ఫస్ట్ లుక్ లోనే అందరినీ ఆకట్టుకున్నాడు. అలాగే టీజర్ లో చెప్పిన ‘ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని’ డైలాగ్ మెగా అభిమానులను ఈ టీజర్ ఒకటికి రెండు సార్లు చూసేలా చేసిందని చెప్పడంలో సందేహం లేదు.

అయితే ‘అదుర్స్’ చిత్రంలో చారి పాత్రను అద్భుతంగా పోషించడం ద్వారా, టాలీవుడ్ లో బ్రాహ్మణుని పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్’గా మారారు. మరి జూనియర్ ను మరిపించే విధంగా అల్లు అర్జున్ చేసారా? అన్నది “దువ్వాడ జగన్నాధమ్”ను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. టీజర్ లో చూపించిన ఒకే ఒక డైలాగ్ అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా చెప్పారో, అదే డైలాగ్ డెలివరీని అల్లు అర్జున్ నూటికి నూరు శాతం ఫాలో అయ్యాడని చెప్పాలి.

ADVERTISEMENT

ఈ సింగిల్ డైలాగ్ తో సినిమా మొత్తాన్ని నిర్ణయించడం తొందరపాటే అవుతుంది గానీ, ‘దువ్వాడ’ పాత్రలో నెగిటివ్ అభిప్రాయాలను అయితే బన్నీ సొంతం చేసుకోలేదనే చెప్పాలి. ఇలాంటి పాత్రలను పోషించడం అనేది… స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలకు ఛాలెంజ్ తో కూడుకున్నది. ‘అదుర్స్’లో ఎన్టీఆర్ అయితే ‘అవుట్ స్టాండింగ్’ మార్కులు వేయించుకోగా, ఈ టీజర్ తో బన్నీ ‘పాస్ మార్కులు’ వేయించుకున్నాడు. అయితే సినిమా విడుదల తర్వాత మాత్రమే అసలు ఫలితం తేలనుంది.

ADVERTISEMENT
Latest Stories