ఇప్పుడు ఆ గొడవ ఎందుకు?: పుష్ప టీమ్

allu arjun pushpa movie latest updateస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం పుష్ప నిర్మాతలు తమ చిత్రాన్ని రెండు భాగాలుగా తియ్యనున్నట్టు ధృవీకరించారు. రెండు భాగాల నిర్ణయం తీసుకున్న తరువాత, వారు ఈ చిత్రంలో మరో అదనపు పాటను కూడా యాడ్ చెయ్యబోతున్నట్టు నిర్మాత వెల్లడించారు. కొత్త గా యాడ్ చెయ్యబోయే ఈ పాట ఐటమ్ సాంగ్ అని అంటున్నారు.

ఈ పాట కోసం వారు ఇంకా హీరోయిన్‌ను ఖరారు చేయలేదని ఇప్పటికే చిత్ర ప్రకటించారు. అయితే ఈ లోగానే ఐటమ్ సాంగ్ హీరోయిన్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. పూజా హెగ్డే, దిశా పటాని వంటి పేర్లు ఇప్పటికే రౌండ్లు వేస్తున్నాయి. కానీ ఇంకా ఏమీ ధృవీకరించబడలేదని మనకు ఉన్న సమాచారం.

ADVERTISEMENT

ఐటెమ్ సాంగ్ పుష్ప రెండవ భాగంలో వస్తుంది. పాటను చిత్రీకరించడానికి చాలా సమయం ఉంది. దానితో ఐటెమ్ సాంగ్ హీరోయిన్‌ను ఖరారు చేయడానికి వారు తొందర పడటం లేదట. “కోవిడ్ కారణంగా మాకు కావలసిన డేట్స్ గురించి మాకు ఖచ్చితంగా తెలియదు అలాగే హీరోయిన్లకు కూడా వారి డేట్స్ మీద షూటింగ్లు మొదలయ్యే వరకు క్లారిటీ ఉండదు. కాబట్టి, ఇప్పటి వరకు అలాంటి చర్చలు లేవు” అని చిత్రబృందం మనతో అంటుంది.

ఇది ఇలా ఉండగా… ఒక పాట, రెండు సీన్ల మినహా మొదటి పార్టు పూర్తి అయ్యిందట, అలాగే రెండో పార్టులో 10% షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. ఈ ఏడాది దసరా నాటికి మొదటి పార్ట్ ని విడుదల చేసి రెండవ భాగాన్ని వచ్చే ఏడాది నాటికి విడుదల చెయ్యాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories