ఒక్క క్షణం సినిమాతో ఊపిరి తీసుకున్న అల్లు హీరో శిరీష్, మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి మలయాళం రీమేక్ తో వస్తున్నాడు. మలయాళం లో మమ్మూటీ కొడుకు దుల్కర్ సల్మాన్ నటించిన ఏబీసీడీ – అమెరికన్ బోర్న్ .. కాన్ఫ్యూజ్డ్ దేశి, సినిమా విజయం సాధించగా, అల్లు శిరీష్ రీమేక్ చెయ్యడానికి సిద్ధపడ్డాడు. మధుర శ్రీధర్ నిర్మాణం లో … కొత్త దర్శకుడు సంజీవ్ రెడ్డి ని పరిచయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
అల్లు శిరీష్ ఎప్పటినుండో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అన్న అల్లు అర్జున్ అంత టాలెంట్ లేకపోయినా, బ్యాగ్రౌండ్ సపోర్ట్ తో కొన్ని సినిమాలు చేసాడు. జనాలకు రిజిస్టర్ అయ్యినా, ఇమేజ్ మాత్రం సంపాదించుకోలేక పోయాడు. ఒక్కక్షణం సినిమా బాగుంది అన్న టాక్ తెచ్చుకున్నా .. హిట్ మాత్రం కాలేదు.
కనీసం ఈ మలయాళ రీమేక్ అయినా కలిసొస్తుందో? లేదో? అల్లు శిరీష్ డైరెక్టుగా మలయాళం లో మోహన్ లాల్ తో కలిసి 1971 అనే మిలిటరీ సినిమా చేసాడు. అది అట్టర్ ప్లాప్ అయ్యిందండోయ్.



