అమరావతిలో శాశ్వత హైకోర్టుకు వారంలో టెండర్లు!

amaravati-high court- tendersఅమరావతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది. సీఆర్‌డీఏ దీనికి వారం రోజుల్లో టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమవుతోంది. టెండర్ల ఖరారు తర్వాత రెండు-రెండున్నరేళ్లలో పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే గానీ హైదరాబాద్ హై కోర్టు విభజన సాధ్యం అయ్యేలా లేదు.

ADVERTISEMENT

ప్రభుత్వ భవనాల సముదాయంలో అటు అసెంబ్లీకి, ఇటు సచివాలయానికి చేరువలో.. సుమారు 42 ఎకరాల సువిశాల ప్రాంగణంలో, బౌద్ధ స్థూపాకృతిలో ఈ దిగ్గజ భవంతి రూపుదిద్దుకోనుంది. అత్యాధునిక పరిజ్ఞానం, రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా నిర్మించనున్న శాశ్వత హైకోర్టు నిర్మాణానికి దాదాపు 1168 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు.

జి ప్లస్‌ 7 అంతస్థులతో ఈ నిర్మాణం ఉండబోతుంది. హైదరాబాద్‌లోని ప్రస్తుత ఉమ్మడి హైకోర్టులోని కోర్టు హాళ్ల పరిమాణంతో పోల్చితే అధిక విస్తీర్ణంతో, మెరుగైన వసతులతో రూపుదిద్దుకోనున్నాయి. కక్షిదారులు, ఉద్యోగులు, న్యాయవాదులకు అవసరమైన వసతులన్నీ.. రెస్టారెంట్‌, గ్రంథాలయం, జ్యుడిషియల్‌ మ్యూజియం, సమావేశ మందిరం, లాంజ్‌లు మొదలైనవాటితో పాటు న్యాయమూర్తులు విశ్రాంతి తీసుకునేందుకు యోగా, జిమ్నాజియం వంటి వసతులనూ కల్పించనున్నారు.

ADVERTISEMENT
Latest Stories