అమరావతి డిజైన్లు మళ్లీ ఫారెన్ వాసనలు!

Amaravati Designs Chandrababu Naiduఆంద్రప్రదేశ శాసనసభ భవనం నిర్మాణం నిమిత్తం పదమూడు రకాల డిజైన్ లను నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతిపాదించింది.వాటిని ప్రజల అబిప్రాయాల నిమిత్తం బుధవారం సోషల్ మీడియాలో పెట్టారు. పరిపాలన నగరం డిజైన్ తో పాటు అసెంబ్లీ, సచివాలయం,హైకోర్టు నమూనాలను కూడా ఈ సంస్థ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.

గత కొంతకాలంగా ఈ సంస్థ రూపొందించిన ఈ డిజైన్ లను చంద్రబాబు అంగీకరించలేదు.చివరికి ప్రముఖ ధర్శకుడు రాజమౌళిని లండన్ పంపి ఆయన అభిప్రాయం కూడా తీసుకున్నారు. .ఆ తర్వాత వీటిని విడుదల చేశారు.కాగా ఈ పదమూడు డిజైన్ లలో గతంలో ఇచ్చిన మూడు కూడా ఉన్నాయి.

ADVERTISEMENT

ఐతే ఈ కొత్త డిజైన్లు కూడా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా లేవని సోషల్ మీడియాలో విస్తృత అభిప్రాయం. గతంలో లాగే వీటికి కూడా ఫారెన్ వాసనలు వస్తున్నాయని వారి అభిప్రాయం. ఈ నెలాఖరున ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ వెళ్ళి నార్మన్ పోస్టర్ సంస్థ ఆఫీస్కు వెళ్తారు. తుది నిర్ణయం అప్పుడే జరగొచ్చు.

ADVERTISEMENT
Latest Stories