నాడు అమరావతి విలవిలా.. నేడు కళకళా!

Amaravati New Look with development works

ఓ వ్యక్తి మీద మరో వ్యక్తి పగపట్టడం చూశాము కానీ ముఖ్యమంత్రే తన రాష్ట్రం మీద పగబట్టడం వైసీపీ పాలనలోనే చూశాము.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గర్వంతో చెప్పుకోవలసిన రాజధాని అమరావతిని జగన్‌ ఓ శిధిల నగరంగా మార్చేశారు. రాజధాని రైతుల ఆందోళనలు తప్ప అమరావతిలో మరేవీ కనిపించేవి కావు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఈ తొమ్మిది నెలల్లో జంగిల్ క్లియరెన్స్ పనులన్నీ పూర్తిచేసి, రోడ్లను సరిచేసి స్ట్రీట్ లైట్స్ వెలిగిస్తుండటంతో రాత్రి వేళల్లో కూడా అమరావతి ఆ విద్యుత్ కాంతులలో ధగధగా వెలిగిపోతోంది.

ఇప్పటికే నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ చురుకుగా సాగుతోంది. త్వరలో నిర్మాణ పనులు మొదలైతే అమరావతి మరింత సందడిగా మారుతుంది.

అమరావతి నవనగరాలలో భాగంగా మంగళగిరి సమీపంలో నిడమర్రులో 6,577 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్‌, హైటెక్ సిటీలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాంతంలోనే అన్ని ఐటి కంపెనీలు కంపెనీలకు భూములు కేటాయిస్తోంది.

ముందుగా 10 ఎకరాలలో ఓ ఐకానిక్ ఐటి టవర్ నిర్మించే బాధ్యత ఎల్&టి కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. దీనిని ‘డీప్‌టెక్ ఐకానిక్ టవర్‌’గా నిర్మించబోతోంది. దీని నిర్మాణం పూర్తయిన తర్వాత దీనిలో ఐటి కంపెనీలకు అద్దెకు ఇస్తుంది.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఐటి కంపెనీలకు, ఇకపై కొత్తగా రాష్ట్రానికి వచ్చే ఐటి కంపెనీలకు నిడమర్రులోనే ప్రభుత్వం భూములు కేటాయించబోతోంది. కనుక హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు ధీటుగా ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందబోతోంది.

గత 5 ఏళ్ళుగా శిధిల నగరంగా మిగిలిపోయిన అమరావతి కేవలం 9 నెలలో ఇంత మార్పు రావడానికి కారణం సిఎం చంద్రబాబు నాయుడు ధృడ సంకల్పం, నిబద్దత, దూరదృష్టి కారణమని వేరే చెప్పక్కరలేదు.

ADVERTISEMENT
Latest Stories