ORR అమరావతి కి రాజమార్గం కానుందా.?

Amaravati ORR tenders invited by NHAI

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి నేషనల్ హై వే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)అధికారికంగా టెండర్లను ఆహ్వానించింది. అయితే ఈ నవంబర్ 18 లోగా బిడ్లు సమర్పించాలంటూ కట్ ఆఫ్ డేట్ కూడా ప్రకటించింది.

మొత్తం ఈ ప్రాజెక్ట్ ను నాలుగు ప్యాకేజ్ లుగా విభజించి టెండర్ ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 195 కిలోమీటర్ల పొడవుతో, 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే గా నిర్మించబోతున్న ఈ ORR అంచనా వ్యయం సుమారు రూ. 11500 కోట్లు. అయితే నాలుగు ప్యాకేజ్ లుగా విభజించబడిన ఈ ORR లో

ADVERTISEMENT

మొదటి ప్యాకేజ్ కింద ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల – మైలవరం మధ్య 27 కిలోమీటర్ల, ప్యాకేజ్ – 2 కింద మైలవరం – కోలవెన్ను మధ్య 56 కిమీ, ప్యాకేజ్ -3 కింద కోలవెన్ను – పుల్లడిగుంట మధ్య 55 కిమీ, ప్యాకేజ్ – 4 లో భాగంగా పుల్లిడిగుంట – కంచికచర్ల మధ్య 55 కిమీ ల రహదారి నిర్మాణం జరగనుంది.

NHAI ఆధ్వర్యంలో నిర్మించబోతున్న ఈ 6 లైన్ గ్రీన్ ఫీల్డ్ హై వే కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన భూసేకరణ, దానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పన కోసం సుమారు రూ. 3111 కోట్లు వెచ్చించనుంది. అయితే రాష్ట్ర రాజధాని అమరావతి ORR నిర్మాణం పూర్తయితే రాజధానికి, దానికి సమీపంలో ఉన్న ప్రాంతాలకు కనెక్టివిటీ అవకాశాలు మెరుగవుతాయి.

తద్వారా రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి బాట పడుతుంది. దానికి తోడు సంబంధిత ప్రాంతాల భూముల ధరలు రెట్టింపు అవుతాయి. అలాగే ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడుతుంది. 2029 ఎన్నికలకు ముందే కూటమి ప్రభుత్వం సాధ్యమైనంత మేరకు ORR పనులను పూర్తి చేసి రాజధాని అమరావతికి సింహ ద్వారాలు తెరవాలని ఆశిస్తుంది.

అమరావతి అభివృద్దిలో ORR నిర్మాణం కూడా అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే మొదటి దఫా ప్యాకేజ్ కింద నిర్మించబోయే కంచికచర్ల – మైలవరం మధ్య 27 కిమీ ల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, సంబంధిత పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసే పనిలో పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అనుకున్నది అనుకున్నట్టుగా పనులు ముందుకు తీసుకెళ్లగలిగితే ORR అనేది అమరావతికి రాజమార్గం అవుతుంది. రాజమార్గం అంటే కేవలం రహదారి నిర్మాణాలు మత్రమే కాదు అమరావతి అభివృద్ధికి తెరుచుకునే ఒక గొప్ప అవకాశం కూడా. మొదటి ప్యాకేజ్ లో నిర్మించే ఈ 27 కిమీల రహదారి హైద్రాబాద్ వాసులకు అమరావతిని మరింత చేరువ చేస్తుంది.

ADVERTISEMENT
Latest Stories