రాజధాని కోసం భూములిచ్చిన రైతులందరూ ద్రోహులు అన్నట్టు చూస్తున్నారు అధికార పార్టీ వారు. భూమిలిచ్చే ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతులు రోడెక్కితే వారిని పెయిడ్ ఆర్టిస్టులను, రియల్ ఎస్టేట్ ఏజెంట్లని మంత్రులే అనడంతో పార్టీ క్యాడర్ కూడా వారిని అదే దృష్టిలో చూస్తుంది. సోషల్ మీడియాలో కూడా రైతులకు వ్యతిరేకంగా వారు క్యాంపైన్ రన్ చేస్తున్నారు.
తాజగా సోషల్ మీడియాలో రాజధాని మహిళలపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టారు. దీనిపై మహిళా రైతులు మండిపడుతున్నారు. పులివెందులకు చెందిన రవీంద్రారెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాడు. చంద్రబాబు కుటుంబ సభ్యులపైనా అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టాడు.
దీనిపై మందడం డీఎస్పీ కార్యాలయంలో మహిళా రైతుల ఫిర్యాదు చేశారు.ఇటీవలే కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మీద సోషల్ మీడియాలో ఏవైనా కామెంట్లు పెడితే వెంటనే ప్రభుత్వం కేసులు పెడుతుంది. అదే విధంగా ఎవరైన అసభ్యకర పోస్టింగ్‌లు పెడితే దిశ చట్టం కింద జైలుకు పంపుతామని ప్రభుత్వం శాసనసభ సాక్షిగా ప్రకటించింది.
తమపై పోస్టులు పెట్టే వారి పైడ్ కూడా యాక్షన్ తీసుకోవాలని రైతులు అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ కేసు నమోదు చెయ్యలేదని సమాచారం. ఇది ఇలా ఉండగా అమరావతి రైతుల ఆందోళన నేడు 23వ రోజుకు చేరింది. మరోవైపు జిల్లాలలో టీడీపీ, సిపిఐ, అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన బస్సు యాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం విశేషం.





