వాళ్ళకి టికెట్స్ ఇవ్వలేమని ముందే చెప్పాము

YSRCP_Ambati_Rambabu_MLC_Electionsఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేశారని ఆరోపిస్తూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. మంత్రి అంబటి రాంబాబు శనివారం ఉదయం సచివాలయం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ, “మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ముందే సస్పెండ్ ఎమ్మెల్యేలలో ఇద్దరు (మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) ఎమ్మెల్యేలు సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వారికి టికెట్స్ ఇస్తాం… చూస్తాం అని కాకుండా వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వలేమని స్పష్టంగా చెప్పేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలకి టిడిపి ఒక్కొక్కరికీ రూ.10 నుంచి 15 వరకు కోట్లు ముట్టజెప్పడంతో వారు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. కనుక ఆ నాలుగురిని పార్టీ నుంచి శాస్వితంగా బహిష్కరించే అవకాశం ఉంది,” అని అన్నారు.

వారు నలుగురూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కనుక వచ్చే ఎన్నికలలో కూడా పోటీ చేయాలని కోరుకోవడం చాలా సహజం. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి వారి నియోజకవర్గాలలో వేరేవారిని ఇన్‌ఛార్జ్‌లుగా నియమించి అవమానపరిచారు. ఇది వారి ఆహాన్ని దెబ్బతీసింది. అందుకే వారు… క్రాస్ ఓటింగ్ చేస్తే తెలిసిపోతుందని, పార్టీ తమపై ఇటువంటి చర్యలు తీసుకొంటుందని తెలిసి ఉన్నప్పటికీ సాహసించారని అర్దమవుతూనే ఉంది. అంటే తమకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని ఆ నలుగురు వైసీపీపై ప్రతీకారం తీర్చుకొన్నారని స్పష్టం అవుతోంది. కానీ వైసీపీ తన ఈ ఓటమిని కూడా టిడిపిపై పైకి తోసేసి కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోందని మంత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లోనే అర్దమవుతోంది.

ADVERTISEMENT

అయినా మరో ఏడాదిలోగానే ఎన్నికల గంట మ్రోగబోతున్నప్పుడు టిడిపి ఓ ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి ఇంత ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమిటి?టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధని గెలిపిస్తే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏం ప్రయోజనం?

ADVERTISEMENT
Latest Stories