Trade War Stock Markets

ట్రంప్ టారిఫ్ నిర్ణయాలతో ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్ కు రంగం సిద్ధమయినట్లు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ట్రంప్ తీసుకొచ్చిన ఈ టారిఫ్ నిబంధనలతో అమెరికాతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లు కరోనా విపత్తు సమయంలో మాదిరి కుప్పకూలాయి.

దీనితో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ఎంతోమంది పెట్టుబడిదారుల సంపద ఒక్కసారిగా ఆవిరయినట్లు అయ్యింది. ఈ టారిఫ్ విధానాలు అగ్రరాజ్యాన్ని సైతం ఆర్థికంగా కుదేలు చేస్తుంది అంటూ ఇంటా బయట ట్రంప్ కి వ్యతిరేకంగా ఆందోళనలు సాగాయి. అయిన ట్రంప్ మాత్రం తగ్గేదెలా అన్నటుగా ముందుకెళ్తున్నారు.

Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.

దీనితో వరుసగా స్టాక్ మార్కెట్లు పతనం దిశగా పయనమయ్యాయి. అయితే ఈ అగ్ర రాజ్య ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా అడుగు ముందుకు వేయడానికి భారత్ తో సహా చాల దేశాలు సాహసించడం లేదనే చెప్పాలి. చైనా మాత్రం వైట్ హౌస్ నిర్ణయాలను నిలదీస్తూ వారికి పోటీగా అమెరికా ఉత్పత్తుల పై కూడా అదే స్థాయిలో టారిఫ్ లను ప్రకటిస్తూ దూకుడు ప్రదర్శిస్తుంది.

దీనితో ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలయ్యింది. అయితే ట్రంప్ మాత్రం ఒక్క చైనా ను మినహాయించి మిగిలిన అన్ని దేశాల ఉత్పత్తుల మీద అదనంగా విధించిన సుంకాలను మరో 90 రోజుల పాటు హోల్డ్ లో పెట్టినట్టు ప్రకటించారు. దీనితో స్టాక్ మార్కెట్ల ఇన్వెస్టర్లందరూ కాస్త ఊపిరి తీసుకున్నారు.

Also Read – ఒక్క హిట్ ప్లీజ్…

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అటు అమెరికాతో పాటుగా దాదాపు అంతర్జాతీయ మార్కెట్లన్నీ కూడా పాజిటివ్ గా స్పందిస్తూ మదుపరులకు లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే అమెరికా, చైనా ఉత్పత్తుల పై గణనీయంగా 145 % మేరకు సుంకాలు విధించగా దానికి ధీటుగా చైనా కూడా అమెరికా ఉత్పత్తుల పై 125 % టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించింది.

దీనితో మరోసారి అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రపంచ దేశాలను బెదిరించేలా ఉన్నాయంటూ, వీటిని సహించడానికి చైనా సిద్ధంగా లేదంటూ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ పేర్కొన్నారు.

Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!

అయితే అటు అమెరికా అటు చైనాల మధ్య జరుగుతున్న ఈ టారిఫ్ ల ట్రేడ్ వార్ తో స్టాక్ మార్కెట్లు వైకుంఠపాళీ ఆటను తలపిస్తున్నాయి అంటున్నారు ట్రేడ్ వర్గీయులు. టారిఫ్ అమలు అంటే వైకుంఠపాళిలో పాము కాటు మాదిరి స్టాక్ మార్కెట్లు శరవేగంగా పాతాళానికి పడుతున్నాయి, లేదు లేదు టారిఫ్ అమలుకు ఇంకాస్త సమయం ఉంది అంటే నిచ్చెన ఎక్కినంత వేగంగా స్టాక్ మార్కెట్లు పై పైకి ఎగబాకుతున్నాయి.




మరి ఈ వైకుంఠపాళీ ఆటకు చెక్ పడేదెప్పుడు, అంతర్జాతీయ మార్కెట్లు సజావుగా సాగేదెప్పుడు.? ట్రంప్ తన టారిఫ్ నిర్ణయాల అమలు పట్ల 90 రోజులు ఇచ్చిన గడువు నేపథ్యంలో ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లు నిఫ్టీ 22800 మార్కుతో 400 పాయింట్లు పాజిటివ్ గా, సెన్సెక్స్ 75150 మార్క్ దగ్గర సుమారు 1300 పాయింట్లు పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి.