హవ్వా సిగ్గు సిగ్గు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం!

Amit Shah - Narendra Modiచీప్ రాజకీయాలు చెయ్యడంలో కాంగ్రెస్ దిట్ట అని మోడీ విమర్శిస్తూ ఉంటారు గానీ, తన ప్రభుత్వం కాంగ్రెస్ కు ఏమాత్రం తీసిపోలేదు అని తాజాగా రుజువు చేసింది. నిన్న విత్త మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ కు చేసిన సాయంపై మరోసారి ప్రకటన చేసారు. పాడిందే పాట రా… అన్న చందాన అదే పాత పాట పడ్డారు ఆయన.

టీడీపీ ఎంపీలు సభ ముగిశాక అరుణ్ జైట్లీ ని కలిశారు. తాను చెయ్యగలిగింది అంతా చేశా అని, ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తో మాట్లాడుకుని ఆయనతో ఒక నోట్ రాయించుకుని రావాలని చెప్పారట. అసలు అమిత్ షా ఎవరు ఏపీకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో డిసైడ్ చెయ్యడానికి?

ADVERTISEMENT

అమిత్ షా ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారి ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అమిత్ షా సహజంగానే బీజేపీ రాజకీయ ప్రయోజనాల బట్టే నిర్ణయాలు తీసుకుంటారు. కాంగ్రెస్ కంటే భిన్నం అని చెప్పుకునే మోడీ దీనికి ఏం సమాధానం చెప్పుకుంటారో? సాక్ష్యాత్తు ఆర్ధిక మంత్రి సైతం రబ్బర్ స్టాంప్ అయితే దేశానికీ ఏమి న్యాయం చేస్తారు?

మరోవైపు నిన్న రాజ్యసభ లాబీలో సుజనా చౌదరి అరుణ్‌ జైట్లీతో వాగ్వాదానికి దిగారు. రెండుసార్లు ప్రకటనలు చేసినా ఎందుకు సంతృప్తి లేదని జైట్లీ ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రతిస్పందిస్తూ ‘డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయలేరు. పార్టీలు ఉంటాయి. పోతాయి. కానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. పార్టీలకు విలువ ఇవ్వాలి.. సంఖ్యాబలానికి కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వాదనతో ‌జైట్లీ అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమించారు.

ADVERTISEMENT
Latest Stories