వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఈ మధ్యకాలంలో చేస్తున్న చర్యలు, ఇస్తున్న ప్రకటనలు వైసీపీ పార్టీకి రాజకీయ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు పై బూతులతో విరుచుకుపడడం దగ్గర మొదలైన అంబటి హంగామా నేటికీ కొనసాగుతూనే ఉంది.
మొన్నీమధ్య సాయి కృష్ణ సంఘటన ను కాపు కుల వివాదంగా మార్చేందుకు అంబటి చేసిన ప్రయత్నాలు, అందుకోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వైసీపీ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఒక లాకప్ డెత్ కేసుకి కులం రంగు పూయడం, ఆ మరకలను పవన్ కి అంటించాలని చూడడంలో అంబటి కీలక పాత్ర పోషించారు.
అయితే వైసీపీ అంబటి తో చేసిన ఈ ప్రయత్నాలన్నీ కూడా ఫలితాలను ఇవ్వలేదు సరికదా వైసీపీ గత అరాచకాలను మరోసారి తెరమీదకు తెచ్చింది, చర్చలో ఉంచింది. దీనితో ఈ విషయానికి ఇక్కడి తో శుభం కార్డు వేసిన వైసీపీ ఇప్పుడు కొత్తగా రావణ్ వివాదాన్ని భుజానకెత్తుకుంది.
హిందూ దేవతలా మీద, హిందూ పురాణాల మీద, భారదేశం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్ కు మద్దతుగా వైసీపీ ‘హే రామ్ సేవ్ ఆంధ్రా’ అనే నినాదంతో ముందుకొచ్చింది. ఒక పక్క ప్రశ్న రావణ్ రాముని మీద నీచమైన విమర్శలు చేస్తుంటే అదే రాముని పేరు మీద రావణుడికి కాపు కాయలని వైసీపీ ముందుకురావడం వైసీపీ ద్వంద వైఖరికి నిదర్శనంగా కనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ మీద దారుణమైన పదజాలంతో రెచ్చిపోయిన ఈ రావణ్ కు మద్దతుగా వైసీపీ అధినేత జగన్ నుంచి ఆ పార్టీ కీలక నేతలందరు ఆయన అరెస్టు ఖండిస్తూ ఆయన కోసం ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధమంటూ ప్రకటిస్తున్నారు. అయితే ఈ కోవలో కూడా ముందు వరుసలో అంబటి రాంబాబే ఉండడం గమనార్హం.
తాజాగా రావణ్ అరెస్టు వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. రావణ్ కు మద్దతుగా ప్రసంగించేందుకు మైకు అందుకున్న అంబటి ఈ యుద్ధంలో ఈ ఆధునిక సమాజంలో “రావణుడే గెలుసాడు, గెలుస్తాం” ఆ దిశగా దైర్యంగా ముందుకెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉందంటూ ప్రకటించారు.
అయితే రావణ్ అరెస్టుకు విషయంలో అటు ప్రజ నుంచి ఇటు సోషల్ మీడియా పోస్టుల నుంచి ప్రభుత్వానికి మద్దతు పెరుగుతున్న ఈ నేపథ్యంలో అంబటి చేసిన ఈ ప్రకటన వైసీపీ ని రాజకీయంగా ఇరకాటంలో పడేసినట్టే అవుతుంది. ఇప్పటికే వైసీపీ హిందూ వ్యతిరేకవాదాన్ని ప్రోత్సహిస్తుందా అంటూ సోషల్ మీడియాలో వైసీపీ కి వ్యతిరేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇక వైసీపీ అనుకూల సోషల్ మీడియా జర్నలిస్టులు సైతం ఈ విషయంలో వైసీపీ ని వ్యతిరేకిస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. రాముని మీద దూషణలు చేసిన వారికీ వైసీపీ మద్దతా అంటూ వైసీపీ విధానం పై విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను నిలదీస్తున్నారు.
ఇటువంటి నేపథ్యంలో కలియుగంలో రావణుడే గెలుస్తాడు, మేము గెలిపిస్తాం అదే న్యాయం, అదే ధర్మం అంటూ అంబటి చేస్తున్న ఈ ప్రకటనలకు వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందేమో బహుశా..!
ఈ యుద్ధంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపించే బాధ్యత మాది – వైసీపీ నేత అంబటి రాంబాబు.
END OF YCP #AntiHinduYCP pic.twitter.com/rPYwE9fqIs
— Sujeeth OG (@sujeethsignFan) July 10, 2026




