డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీవీ యాంకర్ ప్రదీప్ రేపు కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం గోషామహల్ ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో తండ్రితో పాటు కౌన్సిలింగ్‌కు హాజరైన ప్రదీప్ వాస్తవానికి ఈరోజే కోర్టుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన రేపటి వరకు సమయం కోరడంతో పోలీసులు అంగీకరించారు.
ఈ మేరకు వారు రేపు ప్రదీప్‌ను నాంపల్లి కోర్టులో హాజరపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సంవత్సరం వేడుకల సమయంలో తాగి కారు నడిపి శ్వాసవిశ్లేషణ పరీక్షలు నిర్వహించగా పట్టుబడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజులుగా ప్రదీప్ కేసు చర్చనీయాంశమైంది.
మద్యం సేవించి వాహనం నడపడం తప్పే అని ఆయన ఒప్పుకున్నారు. రేపు నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే కోర్టు ప్రదీప్‌కు జైలు శిక్ష విధిస్తుందా? లేక జరిమానాతో సరిపెడుతుందా? అన్నది ఉత్కంఠగా మారింది. నాయనిపుణులు ఆయన కొన్ని రోజులు జైలు శిక్ష తప్పదు అంటున్నారు.



