గలగలా మాట్లాడే యాంకర్ సుమ ఒక్కసారి తన స్వరాన్ని సవరించి గానం అందుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన సింగర్ కం సంగీత దర్శకుడు రఘుకుంచేకు వచ్చినట్లుగా ఉంది… అందుకే సుమతో ఒక పాటేసుకున్నాడు కుంచె. మా టీవీ కార్యక్రమానికి సంబంధించిన సుమ ఈ ఆలాపన చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు రఘుకుంచే.
ఇటీవలే ‘నాయకి’ సినిమా ద్వారా హీరోయిన్ త్రిషను కూడా రఘు గాయకురాలిగా మార్చిన విషయం తెలిసిందే. ఈ వారంలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపధ్యంలో త్రిష స్వరానికి ప్రేక్షకులు ధియేటర్లో ఏ విధంగా స్పందిస్తారో తెలియనుంది. హీరోయిన్లు, యాంకర్లను ఇలా గాయకులుగా మార్చివేస్తే… అసలు పాటల వృత్తినే నమ్ముకున్న వారు ఏమైపోతారో… ఒక్కసారి ఆలోచించండి సంగీత దర్శకవర్యులు..!
ADVERTISEMENT
ADVERTISEMENT



