మంగళగిరి రాష్ట్రానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్…

Nara Lokesh Mangalagiri Development

రాష్ట్ర రాజధాని అమరావతి లో ఒక భాగమైన మంగళగిరి రాష్ట్రానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. 2014 రాష్ట్ర విభజన నుంచి కూడా మంగళగిరి నియోజకవర్గం ఎప్పుడు వార్తలలో నిలుస్తూనే వస్తుంది.

మంగళగిరి ఒక పక్క రాజకీయంగా రాష్ట్రానికి కేంద్ర భిందువు కాగా మరోపక్క రాజధాని ప్రాంతంలో భాగం కావడంతో అటు అభివృద్ధిలోనూ తనదైన పాత్ర పోషిస్తూ రాష్ట్రానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.

ADVERTISEMENT

2019 నారా లోకేష్ ఓటమి నుంచి 2024 లోకేష్ గెలుపు వరకు మంగళగిరి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమే. 2019 ఓటమి అవమానాలు మంగళగిరిలో లోకేష్ ని ఎంత బలంగా నిలబెట్టాయి అనేదానికి 2024 గెలుపు విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గా నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధి పనులు మంగళగిరి వాసులతో పాటుగా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాటిలో మచ్చుకకు కొన్ని….

* తాడేపల్లి పేదవర్గాల దశాబ్దాల కల ప్రభుత్వ ఇంటి పట్టాల పంపిణి లోకేష్ గెలుపుతో సాధ్యమయ్యింది.

* ఇక మంగళగిరిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అవసరం లోకేష్ విజయంతో సాకారం కానుంది.

* అలాగే లోకేష్ తన నియోజకవర్గ అభివృద్ధి కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తాగు నీటి పైప్ లైన్లు, విధ్యుత్ కేబుల్స్, స్వచ్ఛ మంగళగిరి వంటి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాలకు ఆధునీకరణను జోడించారు.

* ఇక మంగళగిరి వాసుల కోరిక మేరకు పార్కుల సుందరీకరణ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.

* ఇక మంగళగిరి బ్రాండ్ గా ఉండే శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు, ఘంటా మండపం పునర్నిర్మాణం వంటి ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

* వీటన్నిటికీ తోడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన నిడమర్రు ప్రభుత్వ పాఠశాల మంగళగిరి కి ట్రేడ్ మార్క్ గా నిలిచింది. లోకేష్ విజన్ కి అద్దం పట్టింది. లోకేష్ తన సొంత నిధులతో నిర్మించిన ఈ ప్రభుత్వ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శంగా మారింది అంటే అతిశయోక్తి కాదేమో.

* అలాగే మంగళగిరి కేంద్రంగా లోకేష్ ఆధ్వర్యంలో నిర్మించిన క్రికెట్ స్టేడియం, ఆధునిక పబ్లిక్ లైబ్రెరీ, కొండపనేని టౌన్ షిప్ పార్క్ లోకేష్ కి తన నియోజకవర్గం అభివృద్ధి పై ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

* ఇక నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభమైన మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి పట్ల లోకేష్ కి ఉన్న చొరవను స్పష్టం చేస్తుంది. విధ్యుత్ దీపకాంతులతో, అధునాతన హంగులతో, చూపరుల దృష్టిని ఆకర్షిస్తూ మంగళగిరి రైల్వే స్టేషన్ అత్యాధునికంగా మెరుగులు దిద్దుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

దీనితో మంగళగిరి అభివృద్ధి లో నాటికి నేటికి కనిపిస్తున్న ఆ స్పష్టమైన తేడా అటు సామాన్య ప్రజానీకంలో పాటుగా ఇటు ప్రత్యర్థి పార్టీలకు కూడా అవగతం అవుతుంది. దీనితో మంగళగిరి నాటికి నేటికీ ఎప్పటికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్…అనే భావన కలుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories