ఏ రెండు రోజుల సదస్సు కోసమైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన చెందారో, ఆ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఎంతగా ఈ పెట్టుబడుల సదస్సు సక్సెస్ అయ్యిందంటే… ఇటీవల కాలంలో ఇంత సంతోషంగా తానెప్పుడూ లేదని స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించేటంత! విశాఖపట్నం వేదికగా ఏపీ సర్కార్ నిర్వహించిన రెండు రోజుల భాగస్వామ్య సదస్సు సత్ఫలితాలను ఇచ్చింది. దాదాపు 50 దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు సదస్సుకు హాజరు కాగా మొత్తం 665 ఎంఓయూలు కుదిరాయి.
ఈ ఒప్పందాల ద్వారా భవిష్యత్తులో 10,54,590 కోట్ల విలువైన ఇన్వెస్ట్ మెంట్స్ రాష్ట్రానికి రానున్నాయని, 22,34,096 మందికి ఉద్యోగాలు లభిస్తాయని సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. తమ ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలు చూపుతున్న నమ్మకానికి ఎంఓయూల సంఖ్య నిదర్శనమని తెలిపారు. 2016 భాగస్వామ్య సదస్సులో కుదిరిన 328 అవగాహనా ఒప్పందాల సంఖ్యతో పోల్చితే, రెట్టింపు పైగా కంపెనీలు రాష్ట్రానికి వచ్చేందుకు సమ్మతించాయని వెల్లడించారు.
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



