ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదు అని కేంద్రం పలుమార్లు తేల్చి చెప్తున్నా ఆంధ్రనాయకుల ఆశ తగ్గడం లేదు.. తెలంగాణ నాయకుల ఆరాటం తగ్గడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాల్సిందేనన్నారు. ఏపీలో ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో చిత్త శుద్ధిలేదని విమర్శించారు.
[m9ad]
గతంలో మరో మంత్రి హరీష్ రావు కూడా ఇదే మాట అన్నారు. ఏపీ నాయకులకు చిత్తశుద్ధి లేకపోతే ఇంక తెలంగాణ నాయకులు దాని గురించి భయపడాల్సింది ఏముంది? వారికి ఇస్తే మాకు ఇవ్వాలి అని అడగడం దేనికో? గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయ కవిత ప్రత్యేక హోదాకు మద్దతు పలికారు.
అయితే ఇటీవలే పార్లమెంట్ లో కేంద్రంపై తెలుగు దేశం పెట్టిన అవిశ్వాసానికి తెరాస మద్దత్తు ఇవ్వలేదు. విభజన అనంతరం తెలంగాణకు కేంద్రం ఏమీ చెయ్యకపోయినా ఓటింగు సమయంలో సభ నుండి బయటకు వెళ్ళిపోయి మోడీ ప్రభుత్వానికి మేలు చేశారు. దీనితో బీజేపీ తెరాస మధ్య పొత్తు పొడుస్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.



