జూన్ నాటికల్లా సిద్ధం కానున్న ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం స్వరూప చిత్రాలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. వీటిలో శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణ నమూనాలు చూడ్డానికి అద్భుతంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నిర్మాణాలను శాశ్వతంగా వినియోగించుకునేలా డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
వెలగపూడిలో నిర్మాణం కానున్న ఈ సచివాలయాన్ని ప్రముఖ అగ్రగామి కంపెనీలు ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజీ చేపట్టాయి. ఇటీవలే ప్రారంభం అయిన ఈ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కోరినట్టుగా జూన్ లోపే నిర్మాణాలను పూర్తి చేసి ఇస్తామని నిర్మాణ కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో జూన్ నుంచి తాత్కాలిక సచివాలయంలోనే అసెంబ్లీ సమావేశాలతో పాటు పరిపాలన కొనసాగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



