Anil Kumar Yadav Responds On Political Asceticism

ఇన్నేళ్ళుగా ప్రగల్భాలు పలికిన వైసీపి నేతలందరూ ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్‌ ఏమిటో తెలీని పరిస్థితిలో ఉన్నారు. వారి అధినేత జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌ నుంచి అడుగు బయట పెట్టేందుకు జంకుతుంటే, మిగిలినవారికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు.

పొంచి ఉన్న ప్రమాదాలను ముందే పసిగట్టిన మాజీ ఎంపీ కేశినేని నాని అప్పుడే రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేసిన ఓడిపోయిన మాజీ మంత్రి అనిల్ కుమార్‌ ఈసారి ఎన్నికలలో వైసీపి గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాళ్ళు విసిరారు.

Also Read – జనసేన ‘చిరు’దరహాసం…!

కనుక మీడియా ప్రతినిధులు దాని గురించి ప్రశ్నించగా “అవతలివారు నా సవాలుని స్వీకరించినప్పుడే అది అమలులోకి వస్తుంది కానీ టిడిపి నేతలు నా సవాలుని స్వీకరించనప్పుడు నేను రాజకీయ సన్యాసం చేయవలసిన అవసరం లేదు కదా?” అని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు.

అయితే ఈ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన వైసీపి నేతలు మళ్ళీ ప్రత్యేకంగా రాజకీయ సన్యాసం చేయాల్సిన అవసరం ఉందా?ప్రజలే వారిని ఓడించి రాజకీయ సన్యాసం కట్టబెట్టేశారు కదా?ఒకవేళ వైసీపి నేతలు ఇంకా రాజకీయాలలో ఉండాలనుకుంటున్నా టిడిపి నేతలు ఉండనీయకపోవచ్చు.

Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?

వైసీపి నేతలు ఈ 5 ఏళ్ళుగా టిడిపి, జనసేన నేతలను, కార్యకర్తలను చాలా వేధించారు. కనుక ప్రతీకార చర్యలు తప్పవని వారు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వారిని అడ్డుకున్నా, మళ్ళీ వారి వలన, వారి అధినేత జగన్‌ వలన టిడిపి, జనసేనలకు, ప్రభుత్వానికి ఎప్పటికైనా మళ్ళీ సమస్యలు, సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

కనుక రాజకీయంగా వైసీపికి సమాధి కట్టడానికి టిడిపి, జనసేనలు గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయమే. కనుక వైసీపి నేతలు ప్రత్యేకంగా పనిగట్టుకొని రాజకీయ సన్యాసం చేయనక్కర లేదు. వారు ఓడిపోయినప్పుడే ఆ పని జరిగిపోయింది. ఒకవేళ ఇంకా జరగలేదనుకుంటే రాబోయే రోజుల్లో తప్పకుండా జరుగుతుంది.

Also Read – కింగ్ అందుకుంటాడా.? శర్మ కొనసాగిస్తారా.?