Anna Lezhneva Konidela Tirumala Discussion on YS Bharathi

నిన్న తిరుమల చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటూ డిక్లరేషన్ నుంచి మొక్కులు చెల్లించుకోవడం, స్వామి వారి దర్శనం వరకు అన్ని విషయాలలోనూ ఎటువంటి కాంట్రవర్సి కి తావివ్వకుండా తన యాత్ర పూర్తి చేసుకున్నారు.

అలాగే అగ్ని ప్రమాద ఘటన నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరిట తిరుమల శ్రీతరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి గాను 17 లక్షల విరాళాన్ని అందించారు. అయితే ఈ తిరుమల యాత్ర మొత్తంలో అన్నా కొణిదెల పూర్తిగా హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ కనిపించారు.

Also Read – పవన్ పై కాంగ్రెస్ నేతల హాట్ కామెంట్స్…

ఒక క్రిస్టియన్ అయ్యుండి అన్నా ఇలా హిందూ భక్తుల మాదిరి తిరుమలలో నడుచుకోవడం పై సర్వత్రా అన్నా పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా పవన్, అన్నా దంపతుల కాశీ యాత్ర ప్రయాణాలు, కుంభమేళా సమయంలో అన్నా పాటించిన ఆచారాలు అన్ని కూడా ఆమె పై గౌరవాన్ని పెంచడం తో పాటుగా రాష్ట్రంలో సరికొత్త చర్చలకు దారి తీసింది.

స్వతహాగా క్రిస్టియన్ ఈఆంప్పటికీ అన్నా తన మతాన్ని నమ్ముతూనే ఇతర మతాల పట్ల పూర్తి గౌరవ, మర్యాదలు చూపించడంతో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైస్ భారతి రెడ్డి పై రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. గత ఐదేళ్లు ముఖ్యమంత్రి గా ఉన్న వైస్ జగన్ ఏనాడు హిందూ సంప్రదాయాలకు కట్టుబడి నడుచుకోలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు మొదలయాయ్యి.

Also Read – ప్రధాని పర్యటనపై వైసీపీ సైలంట్.. అంతేగా అంతేగా!

రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తిరుమల పవిత్రతను పెంపొందించేలా స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో కానీ తిరుమల సాంప్రదాయ ఆచార పూజ విధానంలో కానీ జగన్ ఏనాడు తన సతీమణి వైస్ భారతి తో కలిసి పాల్గొనలేదు. శ్రీవారికి ప్రభుత్వం నుంచి అందించే పట్టుబట్టలు కార్యక్రమంలో ఎన్నడూ జగన్ దంపతులు పాలు పంచుకోలేదు అనే అంశాలు మరోమారు చర్చకొస్తున్నాయి.

తన తాడేపల్లి ప్యాలస్ లో తిరుమల సెట్లు వేసి స్వామి వారి పూజా కార్యక్రమాలు నిర్వహించిన జగన్ దంపతులు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో భారతి తో కలిసి ఎన్నడూ తిరుమల కొండ ఎక్కిందే లేదు. కానీ అన్నా తన వ్యక్తిగత కారణాలతో తిరుమల సందర్శించినప్పటికీ తిరుమల ఆచారాలను ఎక్కడ బేఖాతరు చెయ్యలేదు.

Also Read – ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతే… రాజముద్ర వేయాల్సిందే!

అన్య మతస్తులు ఎవరైనా, వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి కావడంతో గతంలోనూ అన్నా, పవన్ ల కుమార్తె తిరుమల సందర్శన సమయంలో డిప్యూటీ సీఎం హోదాలో ఆమె డిక్లరేషన్ ఫామ్ పై తండ్రిగా పవన్ సంతకం చేసిన విషయం తెలిసిందే.




అలాగే ఇప్పుడు కూడా అదే తీరులో డిప్యూటీ సీఎం అర్ధాంగి హోదాలో అన్నా కూడా తన డిక్లరేషన్ పత్రం పై పూర్తి అంగీకారంతో సంతకం చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. కానీ జగన్ మాత్రం ఈ నాటికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో ఒక బాధ్యతాయుత స్థానంలో ఉంటూ కూడా డిక్లరేషన్ పై రాజకీయ విమర్శలు చేస్తూ, తిరుమల కొండ చుట్టూ రాజకీయం నడుపుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.