స్కిల్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిలు మంజూరు చేయాలంటూ బాబు తరుపు న్యాయవాదులు హైకోర్టులో అప్పీలు చేయగా విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పుని రేపటికి రిజర్వ్ లో పెట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు బాబుకి బెయిలు మంజూరు చేస్తారేమో అన్న కంగారులో వైసీపీ ప్రభుతం చంద్రబాబు పై మరో కేసును సిద్ధం చేస్తోంది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారంటూ ఏపీ సిఐడి, ఏసీబీ కోర్టులో పీసీ యాక్ట్ కింద బాబు పై మరో కేసు నమోదు చేసి బాబుని A3 గా పేర్కొంది.
స్కిల్ కేసుతో పాటుగా ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్లలో కూడా బాబు ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే కేసులు నమోదు చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మద్యం కంపెనీలతో మరో ముందడుగు వేసింది. ఇలా బాబు పై ఒకదాని వెనుక మరొక కేసులు వేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీని కంగారుపెట్టాలని భావిస్తుందా?లేక బాబు బయటకు వస్తే తమ పార్టీ గాలి ఆగిపోతుందని కంగారుపడుతుందా?అనేది ఇక్కడ చర్చనీయాంశం.
ఒకవేళ వైసీపీ వాదనే నిజమని భావించిన అక్రమ మార్గంలో గత ప్రభుత్వం నుండి అనుమతులు తెచ్చుకుంటే అటువంటి కంపెనీల మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఏలా సక్రమ పద్దతిలో ప్రజలకు విక్రయిస్తుందో కూడా చెప్పాలి కదా? ఆయా కంపెనీల అనుమతులు రద్దుచేసి సదరు కంపెనీల యజమానులు కూడా అరెస్టు చెయ్యాలి కదా?అసలు ఇలా అక్రమ కంపెనీల మద్యాన్ని గడిచిన నాలుగున్నరేళ్లుగా ప్రజలకు విక్రయిస్తున్న ప్రభుత్వాన్ని కూడా దోషిగా నిలబెట్టాలి కదా?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానిది, సిఐడి అధికారులదే. కానీ ఇవేమి నేరాలు కావు కేవలం అనుమతి ఇచ్చిన వ్యక్తిదే దోషమంతా, శిక్ష పడాల్సింది కూడా కేవలం చంద్రబాబుకే అనే ధోరణితోనే వైసీపీ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి. బాబు ని బయటకు రానివ్వకూడదు అనే ఆదుర్దాతో వైసీపీ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నట్లు ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అధికారం ఉంది కదా అని తానూ చెప్పిందే న్యాయం,తాను చేసేదే చట్టం అంటే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఒప్పుకోదు కదా! ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ పాలకులు మాత్రమే ఉంటారు నియంతలు కాదు అనేది వైసీపీ నాయకులు ఇకనైనా గ్రహించాలి. లేదంటే ప్రజలిచ్చిన ఈ ఒక్క ఛాన్స్ యే వైసీపీ పార్టీకి దక్కిన ఆఖరి ఛాన్స్ అవుతుంది అంటున్నారు టీడీపీ నేతలు.
అసలు ఇచ్చిన మద్యం కంపెనీల అనుమతితో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నది ఎవరు,జేబులు నిండుతున్నది ఎవరికీ, కమిషన్లు చేరేది ఎక్కడికి?ఇంతకీ తప్పెవరిది? అనుమతులు ఇచ్చిన వారిదా? ఇన్నాళ్లు తప్పుడు అనుమతులతో మద్యం వ్యాపారం చేస్తున్నకంపెనీల యజమానులదా? లేక ఆ కంపెనీలతో వ్యాపార ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వానిదా? లేదా ఆ మద్యం విక్రయిస్తున్న సామాన్యుడిదా? సమాజంలో ఉన్న ఇన్ని లోపాలను వదిలి అధికార పార్టీ రాజకీయ వేధింపులకు వత్తాసు పలుకుతున్న వ్యవస్థలదా?






