అనుపమ’ అలా చేయలేదన్న ‘శ్రీమంతుడు’ నిర్మాతలు!

Anupama Parameshawaran Movie With Ram Charan Rumorsసుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ‘శ్రీమంతుడు’ నిర్మాతలు ఓ సినిమాను నిర్మించనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాలో చెర్రీ సరసన, ‘అ…ఆ.., శతమానం భవతి’ సినిమాల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోందన్న వార్తలు హల్చల్ చేసి, ఆ తర్వాత భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో, ఈమెను పక్కన పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

తాజాగా సదరు సంగతులపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. రామ్ చరణ్ తో తీయబోతున్న సినిమాలో అనుపమ భాగస్వామ్యం కాదన్న విషయం వాస్తవమేనని, కానీ, ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేసిందన్న మాటల్లో మాత్రం నిజం లేదని, అదంతా తప్పుడు సమాచారం అని, మంచి టాలెంట్ కలిగిన అనుపమ, మా సంస్థ నిర్మించబోయే భవిష్యత్తు సినిమాలలో నటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ముగించారు.

ADVERTISEMENT

నిర్మాతలు ఇచ్చిన తాజా వివరణతో చెర్రీ సరసన అనుపమ నటించడం లేదని స్పష్టత వచ్చింది గానీ, మెగా పవర్ స్టార్ సరసన జత కట్టబోయే హీరోయిన్ పేరును మాత్రం ఖరారు చేయలేదు. బహుశా దర్శకనిర్మాతలు ఇంకా హీరోయిన్ వేటలోనే ఉన్నట్లున్నారు. గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ చిత్ర కధ కోసం తెలుగు హావభావాలు అద్భుతంగా పలికించగల ముద్దుగుమ్మ కోసం అన్వేషిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories