నా మూవీ సెట్స్ లో ‘నో’ లవ్!

anurag kashyap kalki koechlinసినిమా షూటింగ్ సమయంలో నటీనటులకు నిబంధనలు పెట్టే బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. తన సినిమా షూటింగ్ సెట్లో నటీనటులు ఎవరూ ప్రేమలో పడకూడదనే నిబంధన ఉండేదని, అయితే తొలిసారి దానిని తానే ఉల్లంఘించినట్టు పేర్కొన్నాడు. ‘జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్’ 19వ ఎడిషన్ మూవీ మేళాలో పాల్గొన్న అనురాగ్, ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలకు తెరలేపారు.

2009లో ‘దేవ్ డి’ సినిమా చిత్రీకరణ సమయంలో ఈ నిబంధన విధించానని, అయితే విచిత్రంగా ఇదే సినిమాలో ఆ రూల్‌ ను స్వయంగా తానే ఉల్లంఘించానని, ఈ సినిమాలో చంద్రముఖిగా నటించిన నటి కల్కి కోయెచిన్‌తో ప్రేమలో పడినట్టు వివరించారు. రెండేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ 2011లో వివాహం చేసుకోగా, వీరి వివాహం ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో, 2015లో చట్ట రీత్యా విడాకులు తీసుకున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories