పవన్ కళ్యాణ్ ను ‘దున్నపోతు’ అన్న బిజెపి నేత!

AP BJP - Vema Ayyaji on YS Jagan Pawan Kalyanఅధికారం కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వైకాపా అధినేత వైఎస్ జగన్ లు పగటి కలలు కంటున్నారని ఏపీ బీజేపీ కార్యదర్శి వేమా అయ్యాజీ విమర్శించారు. వీరిద్దరూ దున్నపోతుల్లా తమ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని విమర్శిస్తున్నారని కాకినాడ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్లు కళ్లులేని కబోదులని, వీరికి రాష్ట్రాభివృద్ధి కనిపించకపోవడం హాస్యాస్పదమని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని, అందుకు ప్రధానితో, ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెబుతున్న పవన్, గతంలో ఎన్నడైనా వారితో మాట్లాడారా? అంటూ పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇక, ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ కు ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. పవన్ కు ఉన్న అనుమానాలు ఏంటో తమకు తెలియజేయాలని, ఏపీ అభివృద్ధికి సహకరించేలా నిధులు ఇచ్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు సిద్ధంగా ఉందని, ఇప్పటికే ఎన్నో నిధులను ఇచ్చామని, విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని తెలిపారు. హోదా ఇవ్వలేక అందుకు సమానమైన ప్యాకేజీని కేంద్రం అందిస్తోందని గుర్తు చేస్తూ, పవన్ వంటి వ్యక్తులు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడరాదని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిని సారించి సలహాలు, సూచనలు ఇవ్వాలని పురందేశ్వరి కోరారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories