AP CM Chandrababu Naidu Delhi Tour

ప్రస్తుతం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి సంబందించిన ప్రాజెక్టులు, నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాల గురించి చర్చిస్తున్నారు.

ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మూడు పార్టీల ఎంపీలు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొంటున్నారు. ఇదేమీ పెద్ద విశేషం కాదు. కానీ రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో వీరందరూ కలిసి పాల్గొన్న సమావేశంలో ఆయన పక్కనే సిఎం చంద్రబాబు నాయుడుకి కుర్చీ వేసి గౌరవిం విశేషమే కదా?

Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసులో.. జగన్‌ కూడా?

గతంలో జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ ఢిల్లీ వెళుతుండేవారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో ఏకాంతంగానే భేటీ అవుతుండేవారు. కానీ ఇలా మంత్రులు, ఎంపీలను వెంటబెట్టుకొని వెళ్ళి కేంద్ర మంత్రులతో ఈవిదంగా సమావేశాలలో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ.

అప్పుల కొరకో, కేసుల భయంతోనో ప్రధాని మోడీ, అమిత్ షాల పట్ల జగన్‌ చాలా విధేయంగా ఉండేవారు. అయినప్పటికీ ఢిల్లీ వెళితే ఇటువంటి సమావేశాలు కాదు కదా కనీసం అపాయింట్‌మెంట్‌ లభించేవి కావు.

Also Read – రేపు రెంటపాలకు జగన్‌.. ఏం ప్లాన్ చేశారో?

ఒక్కోసారి జగన్‌ ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ లభించకపోతే, సెల్లారులో తన కారులోనే కూర్చొని గంటల తరబడి పబ్జీ గేమ్స్ ఆడుకొని కాలక్షేపం చేసి, విజయవాడ తిరిగి వెళ్ళిపోయేవారని రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ బీజేపి నాయకుడు బయటపెట్టారు. కానీ ప్రధాని మోడీతో జగన్‌ భేటీ అయ్యి రాష్ట్రానికి సంబందించిన అంశాలపై లోతుగా చర్చించేశారని ఆయన సొంత మీడియాలో వ్రాయించుకునేవారని ఆ బీజేపి నేత చెప్పారు.




కనుక సిఎం చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డికి మద్య ఎంత తేడా ఉందో అర్దం చేసుకోవడానికి ఈ ఒక్క ఫోటో చాలదా?

Also Read – మిథున్ రెడ్డి ఏ-4 అంటే సరిపోదు…