ఏపీలో ఘోర ప్రమాదం… చంద్రబాబు ఏం చేస్తున్నారు?

Ap CM chandrababu Naidu Hirakund Express Derailఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జగదల్ పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ కొమరాడ మండలం కూనేరు వద్ద పట్టాలు తప్పింది. శనివారం నాడు అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరుగగా, 25 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగి, తాజా సమాచారం మేరకు 32కు పెరిగగా, ఇది ఇంకాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.

రెండు ఏసీ బోగీలు, రెండు రిజర్వేషన్, రెండు జనరల్, గార్డు బోగీలు పట్టాలు తప్పాయి. ఎస్ 8, ఎస్ 9 స్లీపర్ బోగీలు బాగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ చంద్రలేఖ ముఖర్జీ మెడికల్‌ రిలీఫ్‌ ట్రైన్‌ తో చేరుకున్నారు. గాయపడ్డ వారిని పార్వతీపురం, రాయ్ గఢ్, విశాఖ ఆసుపత్రులకు తరలించారు. మృతులు, గాయపడిన వారి బంధువులకు సమాచారాన్ని అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లు 8106053006, 8500358712లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

ADVERTISEMENT

ఉత్తరాంధ్ర మంత్రులంతా తక్షణం రైలు ప్రమాదం జరిగిన కూనేరుకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం, ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు, సహాయ చర్యలను ముమ్మరం చేయాలని విజయనగరం, విశాఖ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కలెక్టర్లకు సూచించిన చంద్రబాబు, బాధితులకు అండగా నిలవాలని, మృతదేహాలు స్వస్థలాలకు తరలింపు బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు.

ADVERTISEMENT
Latest Stories