జగన్‌ రాజకీయాలే వేరబ్బా.. మేమే మూల్యం చెల్లించాం!

Chandrababu Naidu Slams Jagan’s Political Propaganda

ఏ ప్రభుత్వమైనా అది చేస్తున్న మంచి పనుల గురించి గొప్పగా చెప్పుకుంటుంది. వర్తమాన రాజకీయాలలో ఇది చాలా అవసరం కూడా. కానీ మంచి పనులు చేశామని చెప్పుకుంటే సరిపోదు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా సమర్ధంగా తిప్పి కొడుతుండటం కూడా చాలా అవసరం.

ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కాస్త అశ్రద్ద కనబరుస్తున్నట్లే ఉంది. కనుక ఈ విషయంలో కూడా సిఎం చంద్రబాబు నాయుడే పార్టీలో అందరినీ హెచ్చరించాల్సి వచ్చింది. ఆయనే ముందుగా చొరవ తీసుకొని తప్పుడు ప్రచారాలతో వైసీపీ ఏవిదంగా రాజకీయాలు చేస్తుంటుందో ప్రజలకు వివరించారు.

ADVERTISEMENT

శుక్రవారం పెద్దాపురంలో జరిగిన సభలో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “ఈ పదేళ్ళలో జగన్‌ అనేక తప్పుడు ప్రచారాలు చేశారు. తాను తప్పులు చేస్తూ వాటిని నాకు, నా ప్రభుత్వానికి ఆపాదిస్తూ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారు.

ఇందుకు చక్కటి నిదర్శనం వివేకా హత్య కేసు. ఆయన గుండెపోటుతో చనిపోయారని చెప్పింది వైసీపీ నేతలే. ఆయన ఇంట్లో రక్తం కడిగింది వారే… అయన శరీరంపై గొడ్డలి పోట్లు కనపడకుండా ఆస్పత్రికి తీసుకువెళ్ళి బ్యాండేజీలు కట్టింది వారే.

కానీ పోస్టుమార్టంలో అయన హత్య చేయబడినట్లు ప్రకటించగానే, నేనే ఆ హత్య చేయించానని వైసీపీ దుష్ప్రచారం మొదలు పెట్టేసింది. నా చేతిలో ఆ కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసింది.

ఆ దుష్ప్రచారాన్ని నమ్మిన ప్రజలు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరూ చూశారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి కాగలిగాడంటే ఎంత ప్రమాదం కొని తెచ్చుకున్నామో అందరూ తెలుసుకోవాలి.

అసలు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడే కాడు. కానీ ఉన్నాడు… మాపై ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఈ పదేళ్ళలో చేసిన అతను (జగన్‌) చేసిన దుష్ప్రచారాలలో కొన్ని ఉదాహరణలు మీకు చెపుతాను. వాటిపై మీరే ఆలోచించుకోండి,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

1. కోడి కత్తి కేసు.

2. గులక రాయి కేసు.

3. వృద్ధులకు పించన్లు ఇవ్వడం లేదని పుకార్లు, పించన్లలో ప్రభుత్వం కోత విదిస్తోందని దుష్ప్రచారం.

4. పల్నాడు పర్యటనలో తన కారు క్రింద సింగయ్య అనే వైసీపీ కార్యకర్త పడి చనిపోతే మేము పోలీస్ రక్షణ కల్పించకపోవడం వల్లనే చనిపోయాడని వాదించారు. అతనిని భార్య, పిల్లలని తాడేపల్లి ప్యాలస్‌కి రప్పించుకొని సింగయ్య అంబులెన్సులో అనుమానస్పద స్థితిలో చనిపోయాడని చెప్పించారు.

5. పరామర్శ యాత్రల పేరుతో బల ప్రదర్శనలు, మహిళలు, పోలీసులపై దాడులు చేయిస్తూ ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని దుష్ప్రచారం. కనుక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దంటూ విదేశీ కంపెనీలకు లేఖలు వ్రాశారు.

6. అమరావతి ముంపు ప్రాంతం దాని నిర్మాణానికి రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులకు లేఖలు వ్రాశారు.

7. అమరావతి మునిగిపోయిందంటూ వేరే ప్రాంతాలలో వరద ఫోటోలతో దుష్ప్రచారం.

పోలవరంలో జోరుగా పనులు జరుగుతుంటే మొన్న వరదలలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని దుష్ప్రచారం.

ADVERTISEMENT
Latest Stories