నేను ఉన్నాను …నేను విన్నాను, మాట తప్పను మడం తిప్పను అంటూ ఎలివేషన్ డైలాగ్లు చెప్పే ముఖ్యమంత్రి జగన్ నిజంగానే ఆ రెండు సందర్భాలలో ఎప్పుడు ఒక మాట మీదే ఉన్నారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడు ప్రజల ముందుకొచ్చినా ఆయన చెప్పే స్క్రిప్ట్ మారదు..,అలాగే ఎప్పుడు ఢిల్లీ వెళ్లిన చెప్పే కారణం మారదు అంటూ జగన్ ఐదేళ్ల చరిత్రను తవ్వి తీస్తున్నారు. ముఖ్యమంత్రిగా బటన్ నొక్కడానికి వచ్చిన ప్రతి సారి ప్రజలను ఉద్దేశించి జగన్ చెప్పే స్పీచ్ లు అన్ని ఒకే రకంగా ఉండడం గమనించవచ్చు.
నాకు చంద్రబాబుకి మాదిరిగా ఒక ఈనాడు లేదు, ఒక ఆంధ్ర జ్యోతి లేదు, ఒక టీవీ 5 లేదు, ఒక దత్త పుత్రుడు లేడు…అంటూ బాబు ని ఉద్దేశించి చేసే విమర్శలలో మాట మార్చకుండా ఐదేళ్లు గా ఒకే మాట మీద నిలబడ్డారు ముఖ్యమంత్రి. జగన్ సభలకు వచ్చిన జనం కూడా సభ ఏదైనా జగన్ స్క్రిప్ట్ మాత్రం ఇదే అనేలా ముందుగానే సిద్ధంగా ఉంటున్నారు.
అలాగే నాలుగేళ్ళకొకసారి కారులని మార్చినట్టు పెళ్లాలను మార్చడం, మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం, ఈ దత్తపుత్రుడికే చెల్లింది, ఈయన పవర్ స్టార్ కాదు పెళ్లిళ్ల స్టార్, చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకునే ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన వ్యక్తత్వాన్ని దెబ్బ కొట్టేలా ఇక ఇదే స్క్రిప్ట్ ను ఫాలో అయ్యిపోయారు జగన్.ఇక స్క్రిప్ట్ వింటున్న ప్రజలు కూడా “మేము విన్నాము…ఆ సభలో మేము కూడా ఉన్నాము” సార్
ఇక చాలు స్రిప్ట్ మార్చండి మహాప్రభో అంటూ గగ్గోలు పెడుతున్నారు.
ఇదంతా రాష్ట్ర రాజకీయాలలో జగన్ చెప్పే స్క్రిప్ట్ అయితే జాతీయ రాజకీయాల కోసం మీడియా వారికీ ఏపీ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చే స్క్రిప్ట్ వేరేలా ఉంటుంది. అయితే ఆ స్క్రిప్ట్ లో కూడా గడిచిన నాలుగున్నరేళ్లుగా ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు జగన్. జగన్ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన మరుసటి రోజునే మీడియా ముందుకు వచ్చి కేంద్రప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రావడంతో మనం చేయగలిగింది ఏమి లేదు అని తేల్చేసారు.
అలాగే మనం వారిని మనకు రావాల్సిన నిధులు కోసం, హక్కుల కోసం అడగడం తప్ప మరేం చేయలేము అంటూ చేతులేత్తిసింది మొదలు ఎన్నికలకు మరో 60 రోజుల సమయం మాత్రమే ఉన్న ఇటువంటి సందర్భంలో కూడా జగన్ అదే స్క్రిప్ట్ వన్నేవేయడం వినడానికి కాస్త విడ్డురంగా ఉంది అంటూ ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి.
ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లిన చెప్పే కారణం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం నిర్మాణానికి అవసరమైన సాయం కోసం మాత్రమే కేంద్ర పెద్దలను కలుస్తున్నారు ఇందులో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవు అంటూ మీడియాకు సమాచారం ఇచ్చే సీఎంఓ ఆ పర్యటన తరువాత రాష్టానికి వచ్చిన నిధులెంత అనేదాని పై మాత్రం నోరు మెదపలేరు.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో ఒక క్లారిటీకి రావడానికి ఢిల్లీ వెళ్లారు. వారు వెళ్లిన కారణం స్పష్టంగా ప్రజలకు, ఆయా పార్టీల నేతలకు చెప్పిన అధినేతలను బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కడానికి బాబు ఢిల్లీ బయలుదేరారు అంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేసి బాబుని కించపరిచిన వైసీపీ అదే సమయంలో జగన్ కూడా మోడీ, అమిత్ షా లతో భేటీ అయ్యారు.
అయితే దీనికి మాత్రం వీరిచ్చే కారణం నలిగిపోయిన పాత స్క్రిప్ట్ పేపరే అనుకోండి. పక్క పార్టీల నేతలు ఢిల్లీ వెళితే కేంద్ర పెద్దల కాళ్ళు పట్టుకోవడానికే అంటూ హేళన చేసే వైకాపా నాయకులు జగన్ వెళ్తే మాత్రం రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం అంటూ కవర్ చేయడం.., చివరికి దొరికిపోవడం అలవాటుగా మారిపోవడంతో ఇకనైనా మాట మార్చండి ముఖ్యమంత్రి గారు జోకులు వినలేకపోతున్నాం అంటూ సామాజిక మాధ్యమాలలో సెటైర్లు పేలుస్తున్నారు.






