ఉద్యోగాల భర్తీ: వైసీపీకి కాలక్షేపం, జాబ్ క్యాలండర్‌తో కూటమి

AP Job Calendar 2026 recruitment update

గత ప్రభుత్వ హయంలో యువత జాబ్ క్యాలండర్ కోసం ఎదురు చూస్తుంటే, జగన్‌ ప్రభుత్వం సంక్షేమ క్యాలండర్ విడుదల చేసేది. కనుక చదువులు పూర్తిచేసుకున్న యువత, ఉద్యోగాల కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు పోతూ ఉండేది.

అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ విడుదల చేస్తుందని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకుంటున్నారు.

ADVERTISEMENT

ఇదివరకు బొత్స సత్యనారాయణ అయిష్టంగా విద్యాశాఖ మంత్రి పదవి చేపట్టగా, నారా లోకేష్‌ ఏరికోరి ఆ శాఖను తీసుకున్నారు.

మాజీ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉత్సవ విగ్రహంలా ఉండిపోగా, నారా లోకేష్‌ ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖలను చేపట్టి పరుగులు పెట్టిస్తున్నారు.

అందువల్లే గత ఐదేళ్ళలో ఏపీకి వచ్చేందుకు భయపడిన అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఇప్పుడు భారీ పెట్టుబడులతో ఆంధ్రాకు తరలివస్తున్నాయి.

జగన్‌ ఐదేళ్ళ పాలనలో లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమ పధకాల పేరుతో పప్పు బెల్లాలా ప్రజలకు పంచిపెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్ళలో సుమారు రూ. 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించింది.

ప్రైవేట్ రంగంలోనే కాదు.. ప్రభుత్వంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలండర్ ప్రకటించి దాని ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేస్తూ ఉద్యోగాలు భర్తీ చేస్తోంది.

నేడు విజయనగరంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్‌, త్వరలో సుమారు 3,000 మంది ఉపాధ్యాయుల భర్తీ కొరకు మరో డీఎస్సీ జారీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

మరోపక్క అమరావతిలో జాబ్ క్యాలండర్-2026 విడుదల చేసినట్లు తాజా సమాచారం. దాని ప్రకారం పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్థక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యా, విద్యుత్ తదితర శాఖల్లో మొత్తం 10,060 ఉద్యోగాల భర్తీకి రాబోయే రెండు నెలల్లో వరుసగా నోటిఫికేషనలు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

వాటిలో గ్రూప్- 1లో 149 పోస్టులు, గ్రూప్-2లో 673 పోస్టులు, డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నేడు విజయనగరంలో మంత్రి నారా లోకేష్‌ కూడా ఇదే చెప్పారుగా!

‘మా పార్టీని మళ్ళీ గెలిపిస్తే డీఎస్సీ తీస్తాము. ఉద్యోగాలు భర్తీ చేస్తామని వైసీపీ చెపుతుండేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఉద్యోగాల భర్తీ మొదలు పెట్టింది.

ఈ విషయంలో దాని చిత్తశుద్దికి నిదర్శనంగా జాబ్ క్యాలండర్ కూడా విడుదల చేసింది. అదీ… మొక్కుబడిగా కాక దానికి కట్టుబడి జాబ్ నోటిఫికేషన్స్ జారీ చేస్తోంది.

అయినా వైసీపీ సన్నాయి నొక్కులు వినక తప్పడం లేదు!

 

ADVERTISEMENT
Latest Stories