ys-jagan-mohan-reddy

‘ఫీజు పోరు’ అంటూ విద్యార్థుల మేనమామ జగన్ మావయ్య తమ మేనల్లుళ్లు, మేనకోడళ్ళ కోసం బెంగళూర్ నుంచి ఏపీకి వచ్చారు కానీ ఆ పోరు పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. అయితే ఇలా పోరాటాలు, ఉద్యమాలు అంటూ పోస్టర్లు విడుదల చేయడం ఆ తరువాత ఆ పాపాలకు కారణం వైసీపీ శాపాలే అనేది తేలడంతో ఆ తప్పులకు సంజాయిషీ చెప్పుకోలేక కార్యక్రమాలను వాయిదా వెయ్యడం వైసీపీకి అలవాటైన పనే.

అయితే ఈసారి వాయిదా వెనుక వైసీపీ ‘ఇంటి పోరు’ కూడా ఒక కారణం అనే టాక్ నడుస్తుంది. వైసీపీ పార్టీకి నెంబర్ 2 , జగన్ కు అత్యంత సన్నిహితుడు, వైస్ కుటుంబానికి వీర విధేయుడు విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం, రాజకీయాలకు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించడం వైసీపీ కి, ఆ పార్టీ క్యాడర్ కు ఊహించని పరిణామమనే చెప్పాలి.

Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?

దీనితో అసలు పార్టీలో ఎం జరుగుతుంది అనే సంశయంలోకి పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు వెళ్లిపోయారు. మొన్న బాలినేని, నేడు సాయి రెడ్డి, రేపు ఎవరు అనే ప్రశ్న పార్టీ ముఖ్య నేతలను వేధిస్తుంది. పార్టీ నుంచి ఇలా కీలకమైన వ్యక్తులే బయటకు వెళ్లిపోతుంటే అసలు తెరవెనుక ఎటువంటి రాజకీయం అందిస్తుంది అనే మీమాంశలోకి వెళ్ళింది పార్టీ.

ఇప్పటికే రేషన్ దందాతో మీడియా ముందుకు రాలేకపోతున్న పేర్ని నాని, కాకినాడ ఫోర్ట్ మాఫియాతో సైలెంట్ అయినా ద్వారం పూడి, అటవీ భూముల ఆక్రమణలతో సద్దుమణిగిన సజ్జల, అడకత్తెరలో ఇరుక్కున్న పెద్ది రెడ్డి ఇలా పార్టీలోని సీనియర్ నాయకులు ఒక్కొక్కరు పార్టీకి ముఖం చాటేస్తూ ముందస్తు బైళ్ల కోసం కోర్టుల చుట్టూ యాత్రలు చేస్తున్నారు.

Also Read – విశాఖ రైల్వే జోన్‌కి ఇన్ని తిప్పలా?

ఇక గత ఐదేళ్లు బూతులతో రెచ్చిపోయిన కొడాలి, బాబు కుటుంబాన్ని అగౌరవపరిచిన వల్లభనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక మిగిలిన చోటామోటా నాయకులు పార్టీ కండువాలు మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇక జగన్ ఇచ్చే పోరు బాటకు, పోరాటాలకు, ఉద్యమాలకు వెన్నంటి నడిచే నాయకులే కరువయ్యారు.




గతంలో మాదిరి ఇప్పుడు జగన్, తన ఆదేశాల అమలుకు పార్టీ సిద్ధమా.? అంటే నాయకుల నుంచి క్యాడర్ నుంచి ఇంకా లేదు అనే సమాధానమే వినిపిస్తుంది. దీనితో జగన్ పోరాటాలన్నీ పోస్టర్లకు, జగన్ సందేశాలన్ని ప్రకటనలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తుంది. ఫీజు పోరుని వాయిదా వేసిన జగన్ కనీసం తానిచ్చిన మాట ప్రకారం ప్రజాక్షేత్రంలోకి వస్తారా.? లేక దానికి కూడా ఒక వాయిదా తీర్మానాన్ని ప్రకటిస్తారా.?

Also Read – తండేల్ కాంబోస్..!