ప్చ్… మహేష్ “ఫస్ట్ లుక్” మళ్ళీ వాయిదా..!

AR-Murugadoss-Mahesh-Babu Firstlook release postponed2016 దసరా పండగ నుండి ప్రిన్స్ మహేష్ బాబు ‘ఫస్ట్ లుక్’ వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలా ఏ ప్రత్యేక రోజు వచ్చినా… మురుగదాస్ – మహేష్ సినిమాల ఫస్ట్ లుక్ దర్శనమిస్తుందని ప్రిన్స్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూడడం, ఆ రోజు ముగియగానే ఇంకా విడుదల కాలేదని నిరుత్సాహ పడడం జరుగుతూ వస్తోంది. ఇటీవల ముగిసిన నూతన సంవత్సరం సందర్భంగా కూడా ఇలాంటి ప్రచారం జరగడం, సంక్రాంతికి వస్తారేమోనని ఎదురుచూడడం జరిగిపోయింది.

ADVERTISEMENT

అయితే సంక్రాంతి కూడా వచ్చేసింది. ఇంతవరకు ఎలాంటి పోస్టర్స్ విడుదల కాకపోగా, తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జనవరి 26వ తేదీకి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల కాబోయే ఈ సినిమా ఫస్ట్ లుక్ ‘వర్త్ వాచింగ్’ అంటూ కోలీవుడ్ సినీ వర్గాలు చెప్తున్న సమాచారం. సినిమా టైటిల్ తో పాటు, ఓ మోషన్ పిక్చర్ ను కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నారన్నది లేటెస్ట్ న్యూస్.

ADVERTISEMENT
Latest Stories