‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తొలిసారిగా నటిస్తోన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా “అరవింద సమేత” ఆడియో ఈ నెల 20వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ రానున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలు హల్చల్ చేయగా, ఇటీవల అయితే ఏకంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ విచ్చేయనున్నారనే ప్రచారం జరిగింది.
[m9ad]
కానీ అవన్నీ ఒట్టి పుకార్లేనని తాజాగా తేలిపోయింది. అసలు ఈ సినిమాకు ఆడియో వేడుక నిర్వహించడం లేదన్న సమాచారం, యంగ్ టైగర్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరుత్సాహపరుస్తుందని చెప్పకతప్పదు, కానీ అదే జరగబోతోంది. ఈ నెల 20వ తేదీన ‘అరవింద సమేత’ ఆడియో నేరుగా మార్కెట్ లోకి విడుదల కాబోతోంది. ఆడియో వేడుకకు బదులుగా, సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మాత్రం గ్రాండ్ గా నిర్వహించనున్నారు.
ఇటీవలే హరికృష్ణ మరణించిన నేపధ్యంలో…. ఈ ఆడియో వేడుకను ఎలా నిర్వహిస్తారు? అందులో జూనియర్ ఎన్టీఆర్ ఎలా ప్రసంగిస్తారు? అభిమానులకు ఏం చెప్తారు? అన్న ఆసక్తికరమైన ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమయ్యాయి. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా… ఎస్.ఎస్.థమన్ స్వరపరిచిన ఆల్బమ్ నేరుగా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సాడ్ న్యూస్ చెప్పిన చిత్ర నిర్మాణ సంస్థ… మంగళవారం నాడు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసామంటూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచింది.



