‘అర్జున్ చక్రవర్తి’ – ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో

Vijay Rama Raju in Arjun Chakravarthy sports drama now streaming on Amazon Prime Video

విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటించిన బ్లాక్ బస్టర్ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీని గుబ్బల నిర్మించారు.

46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం ఆగస్టు 29న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ADVERTISEMENT

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో భావోద్వేగాలు, లవ్ స్టొరీ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం మొత్తం కుటుంబం కలిసి ఎంజాయ్ చేసేలా వుంటుంది. ఈ వీకెండ్‌లో యూత్, ఫ్యామిలీ, అందరూ కలసి చూడటానికి ‘అర్జున్ చక్రవర్తి’ పర్ఫెక్ట్ ఛాయిస్.

ADVERTISEMENT
Latest Stories